Shubman Gill : ఆ సమయంలో ఆందోళనకు గురయ్యా : శుభ్‌మన్‌ గిల్‌

విశాఖ టెస్టులో తాను సాధించిన సెంచరీపై శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gill) స్పందించాడు.

Published : 06 Feb 2024 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  విశాఖలో జరిగిన రెండో టెస్టు(IND vs ENG) రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gill) ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన అతడికి.. ఈ సెంచరీ ఎంతో ఊరటనిచ్చింది. తనపై వచ్చిన విమర్శలకూ ఈ ఇన్నింగ్స్‌ సమాధానం చెప్పింది. తన ఆట తీరుపై మ్యాచ్‌ అనంతరం గిల్ మాట్లాడాడు.

గత కొన్ని ఇన్నింగ్స్‌ల్లో పెద్ద స్కోర్లు చేయలేకపోయిన ఒత్తిడి తనను రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో ఆందోళనకు గురి చేసిందని గిల్‌ అంగీకరించాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో, విశాఖ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అతడు ఆకట్టుకోలేకపోయాడు. ‘‘మొదటి బంతి ఆడుతున్నప్పుడు.. చివరి బంతిని ఎదుర్కొంటునప్పుడు నా హార్ట్‌బీట్‌ ఒకేలా ఉంది. రెండో ఇన్నింగ్స్‌ మొత్తం నా పరిస్థితి ఇలానే కొనసాగింది. ఎంతో ఆందోళనకు గురయ్యా. ఇంగ్లాండ్‌ జట్టు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఉదయం నేను కోచ్‌ ద్రవిడ్‌తో మాట్లాడుతున్నప్పుడు.. నా హృదయ స్పందన వేరేగా ఉంది. నిన్నటి పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది’’ అని వివరించాడు.

డబ్ల్యూటీసీ టేబుల్‌లో దూసుకొచ్చిన భారత్

ఇటీవల రాణించకపోవడానికి బయటి ఒత్తిడి కారణం కాదని.. తన మనసులో ఉన్న ఒత్తిడే కారణమని గిల్‌ పేర్కొన్నాడు. ‘‘రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌, హైదరాబాద్‌ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో ఔటైన విధానంపై నేను నిరాశ చెందాను. నాపై ఉన్న అంచనాల నేపథ్యంలో నా ఆందోళనకు అదే కారణం కావొచ్చు’’ అని గిల్‌ పేర్కొన్నాడు. సోషల్‌ మీడియాలో వచ్చే నెగెటివ్‌ ప్రచారాన్ని తాను పట్టించుకోనని తెలిపాడు.

సెంచరీ సాధించిన అనంతరం పెద్దగా సెలబ్రేట్‌ చేసుకోకపోవడంపై స్పందిస్తూ.. తాను ద్విశతకం చేసి ఉంటే సంబరాలు చేసుకునేవాడినని పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని