world cup 2023 prize money: విశ్వవిజేతకు ప్రైజ్‌ మనీ ఎంతో తెలుసా..?

ఈ టోర్నీ విజేతకు భారీగా ప్రైజ్‌ మనీ అందనుంది. దీనికి సంబంధించిన వివరాలను ఐసీసీ ముందుగానే వెల్లడించింది.

Updated : 19 Nov 2023 13:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు 45 రోజులపాటు జరిగిన ప్రపంచకప్‌లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య తుది సమరం మొదలైంది. ఈ నేపథ్యంలో విశ్వవిజేతకు ఎంత ప్రైజ్‌ మనీ ఇస్తారనే విషయం ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ఐసీసీ ముందుగానే విడుదల చేసింది. ఈ టోర్నీలో విజేతకు 40 లక్షల డాలర్లు  (రూ.33.31 కోట్లు) అందజేయనున్నారు. రన్నరప్‌కు 2 మిలియన్‌ డాలర్లు (రూ.16.65 కోట్లు) దక్కనున్నాయి.

విరాట్, రోహిత్ కాదు.. అతడే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’: యువీ

  • ఈ టోర్నమెంట్‌ మొత్తం ప్రైజుమనీ 10 మిలియన్‌ డాలర్లు (రూ.83.29 కోట్లు).
  • ఫైనల్స్‌కు చేరిన రెండు జట్లు కాకుండా లీగ్‌ దశలోనే ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 40,000 డాలర్ల చొప్పున లభిస్తాయి.
  • ఇక సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయిన ఒక్కో జట్టుకు 8 లక్షల డాలర్లను అందజేయనున్నారు.
  • లీగ్‌ స్టేజీలోనే టోర్నీ నుంచి బయటకు వెళ్లిన ఒక్కో జట్టుకు లక్ష డాలర్ల చొప్పున అందిస్తారు.

దాదాపు 1.30 లక్షల మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా 10 మ్యచ్‌ల్లో 8 విజయాలను అందుకోగా.. భారత్‌ మాత్రం అజేయంగా 10 మ్యాచ్‌లను గెలిచింది. విరాట్‌ కోహ్లీ ఏకంగా 711 పరుగులు చేయగా.. మహమ్మద్‌ షమీ 23 వికెట్లతో వ్యక్తిగత ప్రదర్శనల్లో టాపర్లుగా నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని