Tokyo olympics: ఆగిపోయిన 10వేల వాలంటీర్లు

టోక్యో ఒలింపిక్స్‌కు సమయం దగ్గరపడే కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. జపనీయులు మెగా క్రీడలను రద్దు చేయడమో, వాయిదా వేయడమో కోరుకుంటుంటే.. ప్రభుత్వం, ఒలింపిక్స్‌ సంఘం మాత్రం ముందుకే అడుగులు వేస్తున్నాయి.

Published : 03 Jun 2021 13:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌కు సమయం దగ్గరపడే కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. జపనీయులు మెగా క్రీడలను రద్దు చేయడమో, వాయిదా వేయడమో కోరుకుంటుంటే.. ప్రభుత్వం, ఒలింపిక్స్‌ సంఘం మాత్రం ముందుకే అడుగులు వేస్తున్నాయి. ఒలింపిక్స్‌కు మరో 50 రోజులే ఉన్న నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనని క్రీడాకారుల్లో ఆందోళన నెలకొంది. దాదాపుగా పదివేల మంది వాలంటీర్లు తమ పేర్లను ఉపసంహరించుకున్నారని తాజాగా తెలిసింది.

వాస్తవంగా టోక్యో ఒలింపిక్స్‌ ఏడాది క్రితమే జరగాల్సింది. కరోనా వ్యాప్తితోనే వాయిదా పడింది. ఈ సారి ఎలాగైనా క్రీడలను నిర్వహించాలని జపాన్‌ పట్టుదలగా ఉంది. ప్రతిసారీ ఒలింపిక్‌ గ్రామంలో ఆటగాళ్లు, సిబ్బందికీ సహాయపడేందుకు వాలంటీర్లను నియమించుకుంటారు. ఈ సారి దాదాపు 80వేల మంది టోక్యోకు రావాలని ముందు పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో పదివేల మంది ఇప్పుడు ఆగిపోయారని తెలిసింది. కరోనా వైరస్‌ ఉద్ధృతి, అసలు క్రీడలు జరుగుతాయో లేదోననే సందిగ్ధం దీనికి కారణం. ఇక టోక్యో ఒలింపిక్స్‌ సీఈవో తొషిరో ముటోకు ముందున్నవ్యక్తి చేసిన సెక్సీస్ట్‌ వ్యాఖ్యలకు నిరసనగా కూడా మరికొందరు ఆగిపోయారట. కానీ వాలంటీర్లు కొంతమంది వెనక్కు తగ్గినంత మాత్రానికే క్రీడల నిర్వహణపై దాని ప్రభావం ఏమీ పెద్దగా ఉండబోదని తొషిరో ముటో అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు