Shardul Thakur: ఇలాగే ఆడితే.. చాలామంది ఆటగాళ్లు గాయాలబారిన పడతారు : శార్దూల్‌

బిజీ రంజీ ట్రోఫీ షెడ్యూలింగ్‌పై సీనియర్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌(Shardul Thakur) అసహనం వ్యక్తం చేశాడు.

Published : 05 Mar 2024 01:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : రంజీ ట్రోఫీ(Ranji Trophy) షెడ్యూలింగ్‌పై ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌(Shardul Thakur) అసంతృప్తి వ్యక్తంచేశాడు. ఆటగాళ్ల పనిభారంపై ఆందోళన వ్యక్తం చేసి.. బీసీసీఐ ఈ అంశంపై దృష్టి సారించాలని సూచించాడు. ఆటగాళ్లకు మ్యాచ్‌ల మధ్య విరామం అవసరమని పేర్కొన్నాడు. తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో అద్భుత సెంచరీతో ముంబయి జట్టును శార్దూల్‌ ఆదుకున్న విషయం తెలిసిందే. అతడికిది తొలి ఫస్ట్‌క్లాస్‌ శతకం కావడం విశేషం. రెండోరోజు ఆట అనంతరం అతడు మాట్లాడాడు.

‘‘ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లను మూడు రోజుల గ్యాప్‌తో ఆడటం ఎంతో కష్టం. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు. 7-8 ఏళ్ల క్రితం నేను రంజీ ట్రోఫీలో ఆడినప్పుడు.. మొదటి మూడు గేమ్‌లకు మూడు రోజుల బ్రేక్‌ ఉండేది. ఆ తర్వాత నాలుగు రోజుల విరామం ఇచ్చేవారు. నాకౌట్‌ మ్యాచ్‌లకైతే ఐదు రోజుల విరామం ఉండేది. ఈ ఏడాది మాత్రం.. అన్ని మ్యాచ్‌లను మూడు రోజుల గ్యాప్‌తోనే ఆడుతున్నాం. ఇలా తక్కువ గ్యాప్‌తో వరుసగా పది మ్యాచ్‌లు ఆడి జట్టును ఫైనల్‌కు చేర్చడం ఆటగాళ్లకు ఎంతో కష్టం’ అని శార్దూల్‌ పేర్కొన్నాడు.

సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు..

ఆటగాళ్లకు అవసరమైన విరామం ఇచ్చేందుకు డొమెస్టిక్‌ షెడ్యూల్‌ను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని బీసీసీఐకి శార్దూల్‌ సూచించాడు. వచ్చే ఏడాది ఈ విషయాన్ని పరిశీలిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఇదే పద్ధతి కొనసాగితే.. దేశవ్యాప్తంగా చాలామంది ఆటగాళ్లు గాయాలబారిన పడతారని ఆందోళన వ్యక్తంచేశాడు. శార్దూల్‌ అభిప్రాయంతో తమిళనాడు కెప్టెన్‌ సాయి కిశోర్‌ ఏకీభవించాడు. విరామం లేకుండా ఆడటం ఫాస్ట్‌ బౌలర్లకు ఎంతో కష్టమని తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని