భూ రక్షణ కోసం..
విశాల విశ్వంలో భూమికి ఎప్పుడైనా ప్రమాదం ముంచుకురావొచ్చు. గ్రహ శకలాలు, తోకచుక్కలు ఎక్కడ్నుంచైనా ఢీకొట్టొచ్చు. అందుకే శాస్త్రవేత్తలు అనుక్షణం అంతరిక్షాన్ని జల్లెడ పడుతుంటారు. నిరంతరం శోధిస్తూ, నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు.
విశాల విశ్వంలో భూమికి ఎప్పుడైనా ప్రమాదం ముంచుకురావొచ్చు. గ్రహ శకలాలు, తోకచుక్కలు ఎక్కడ్నుంచైనా ఢీకొట్టొచ్చు. అందుకే శాస్త్రవేత్తలు అనుక్షణం అంతరిక్షాన్ని జల్లెడ పడుతుంటారు. నిరంతరం శోధిస్తూ, నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పూ లేదు గానీ నిజంగానే ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే? దాన్ని ఎదుర్కోవటమెలా? ఇందుకు సన్నద్ధం కావటం కోసమే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గ్రహ రక్షణ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. భూమిని ఢీకొట్టే అవకాశం గల గ్రహ శకలాలను ఉపగ్రహం సాయంతో దారి మళ్లించే పనికి పూనుకొంది.
గ్రహ శకలాలు, తోక చుక్కలు మన భూమికి ఎప్పటికైనా ప్రమాదమే. ఇవి కొన్నిసార్లు గతి తప్పి భూమిని ఢీకొట్టొచ్చు. సుమారు 140 మీటర్ల వ్యాసార్థంతో కూడి, సూర్యుడి నుంచి భూమికి మధ్య గల దూరంలో 5% కన్నా తక్కువ దూరంలోకి వచ్చే వాటిని ‘భారీ ప్రమాదకర వస్తువు’గా పరిగణిస్తారు. నిజానికివి చాలాసార్లు భూమికి ఎలాంటి హాని కలిగించవు. సాధారణంగా భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోతాయి. కానీ పెద్ద గ్రహ శకలాలతో ముప్పు లేకపోలేదు. భారీ గ్రహ శకలం ఒకటి ఢీకొట్టటం వల్లనే భూమిపై డైనోసార్లు అంతరించిపోయాయి. వచ్చే వందేళ్లలో భూమిని ఏదో ఒక గ్రహ శకలం ఢీకొట్టొచ్చని శాస్త్రవేత్తల అంచనా. గమనించాల్సి విషయం ఏంటంటే- ఇలాంటి వినాశకర గ్రహ శకలాల్లో మనకు తెలిసినవి 40 శాతమే. మిగతావన్నీ అజ్ఞాతంగానే ఉండిపోయాయి. అంటే వీటితో ఎప్పుడైనా ప్రమాదం ముంచుకొచ్చే అవకాశముందనే అర్థం. మరి ప్రమాదం వాటిల్లే వరకు చూడకుండా వాటిని మధ్యలోనే తప్పించేస్తే మేలు కదా. ఇలాంటి ప్రణాళికతోనే నాసా ఇటీవల డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్(డార్ట్) వ్యోమనౌకను ప్రయోగించింది. ఇది వచ్చే సంవత్సరం డైమార్ఫోస్ అనే అంతరిక్ష రాయిని ఢీకొట్టనుంది. అలాగని డార్ట్ దీన్ని తుత్తునియలు చేయదు. ఒక వైపు నుంచి నెట్టి దారి మళ్లిస్తుందంతే. మనకు హాని చేయకుండా వేరే కక్ష్యలోకి ప్రవేశించేలా చేస్తుంది. డైమార్ఫోస్ కక్ష్యలోనే 65803 డీడైమోస్ అనే మరో గ్రహ శకలం తిరుగుతోంది. మున్ముందు ఇవి రెండూ భూ కక్ష్యను దాటే సమయంలో భూమిని ఢీకొట్టే అవకాశముంది. సుమారు కిలోమీటరు వ్యాసార్థం గల 65803 డీడైమోస్ ఒకవేళ భూమిని తాకితే పెద్ద ప్రమాదమే సంభవిస్తుంది. దీని కన్నా డైమార్ఫోస్ చిన్నగా ఉంటుంది. అందుకే డార్ట్‌తో దీన్ని దారి మళ్లించటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది విజయవంతమైతే డీడైమోస్నూ ఇలాగే వేరే కక్ష్యలోకి ప్రవేశించేలా చేయటానికి మార్గం సుగమమవుతుంది.
తేలికైన పని కాదు
అంతరిక్షంలో చిన్న వస్తువును ఉపగ్రహాలతో చేరుకోవటం అంత తేలికైన పనికాదు. దాన్ని కచ్చితంగా గుర్తించి, ప్రయోగించాల్సి ఉంటుంది. అందుకే డార్ట్ ప్రయోగం శాస్త్రవేత్తలకు ఓ సవాల్ అని అనుకోవచ్చు. సుమారు 500 కిలోల బరువు గల ఇది సెకండుకు 6.6 కిలోమీటర్ల వేగంతో డైమార్ఫోస్‌ను ఢీకొట్టనుంది. ఈ ప్రక్రియ మొత్తం ఆటోమేటెడ్. అంటే అన్ని వ్యవస్థలు తమకు తామే పనిచేస్తాయన్నమాట. దీన్ని 68 లక్షల మైళ్ల దూరం నుంచి నాసా శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తుండటం గమనార్హం. డార్ట్ నౌక డైమార్ఫోస్‌ను చేరుకుంటే.. భూమ్మీది నుంచి ప్రయోగించిన ఉపగ్రహాలు చేరుకున్న అత్యంత చిన్న అంతరిక్ష వస్తువు ఇదే కానుంది. డార్ట్ ఢీకొట్టిన తర్వాత డైమార్ఫోస్ గమనాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారు. డార్ట్ ఉపగ్రహం లిసియాక్యూబ్ అనే మరో ఉపగ్రహాన్నీ మోసుకెళ్తోంది. డైమార్ఫోస్‌ను ఢీకొట్టాక డార్ట్ ముక్కలు ముక్కలవుతుంది కదా. దీన్ని లిసియాక్యూబ్ 54 కిలోమీటర్ల దూరం నుంచి వీక్షిస్తూ.. డైమార్ఫోస్‌ను తాకిన తర్వాత వెలువడే వ్యర్థాలను లెక్కిస్తుంది.
డైమార్ఫోస్ 11.9 గంటలకు ఒకసారి డీడైమోస్ను చుట్టి వస్తుంది. డార్ట్ చేరుకునే సరికి దీని వేగం కేవలం 73 సెకండ్లు పెరిగితే ప్రయోగం సఫలమైనట్టే. ఇది విజయవంతమైతే పెద్ద గ్రహ శకలాలనూ ఇలాగే దారి మళ్లించటం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అప్పుడు మానవాళి సంరక్షణకు కొత్త ఆయుధం లభించినట్టేనని అనుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్యూగూ.. సూర్యుడికే అన్న!
డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది. -
గూగుల్ లెన్స్‌లో సెర్చ్ హిస్టరీ సేవ్
గూగుల్ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
నిర్ధరణ తీరునూ వివరించే ఏఐ
వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది. -
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
ఫైల్స్‌లో స్కాన్!
డాక్యుమెంట్లు, ఫైళ్లను ఒకదగ్గర నిల్వ చేసుకోవటానికి, తేలికగా షేర్ చేయటానికి గూగుల్ ఫైల్స్ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి కొత్తగా స్కాన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. -
డాక్స్‌లో పాత వర్షన్ కావాలంటే?
గూగుల్ డాక్స్‌లో ఎడిటింగ్ చేస్తూనే ఉంటాం. షేర్ చేసిన ఫైళ్లలో ఎవరెవరో ఏవో మార్పులు చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ముందరి డాక్యుమెంట్‌లోని సమాచారమే బాగుందని అనిపించొచ్చు. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
టాయ్‌లెట్ ఎక్కడ?
బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్ టాయ్లెట్ల విషయంలో మహిళలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. పట్ణణాల్లోనైతే ఈ సమస్య మరీ ఎక్కువ. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
ఫ్లాష్ నోటిఫికేషన్లు ఇలా..
ఫోన్ సైలెంట్లో పెట్టారు. కానీ ముఖ్యమైన నోటిఫికేషన్లు మిస్ అవుతున్నామేమో అని మనసులో అనిపిస్తుంటుంది. అంతలా బాధపడాల్సిన పనిలేకుండా ఫ్లాష్ లైట్ అలర్ట్‌ను సెట్ చేసుకుంటే చాలు. -
లెక్కల్లో గూగుల్ సాయం
లెక్కలంటే చాలామంది విద్యార్థులకు హడల్. ఒకపట్టాన అర్థం కాకపోవటం, తగినంత సాధన చేయకపోవటం వల్ల గణిత సూత్రాలు, నిబంధనలు గుర్తుండవు. దీంతో లెక్కలను చేయటం కష్టమైపోతుంది. -
విండోస్‌లోనూ ఏఐ ఎరేజ్
గూగుల్, సామ్సంగ్ పరికరాల్లో ఏఐ ఆధారిత ఫొటో ఎరేజర్ గురించి వినే ఉంటారు. వీటి జాబితాల్లోకి ఇప్పుడు విండోస్ పీసీలనూ చేర్చుకోండి. మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా జనరేటివ్ ఎరేజ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. -
ఛాట్‌జీపీటీతో ఏఐ టూల్స్ జాబితా
కృత్రిమ మేధ (ఏఐ) సాయంతోనే ఏఐ టూల్స్‌ను వెతికితే? ఇందుకు ఛాట్‌జీపీటీ బాగా ఉపయోగపడుతుంది. తెలివిగా ప్రాంప్ట్‌ను అందించాలే గానీ కోరుకున్నట్టుగా సమాచారాన్ని అందిస్తుంది. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
పెయింట్‌లోనే ఏఐ!
పదాల కూర్పుతో (ప్రాంప్ట్) ఇమేజ్‌లు సృష్టించటం ఇటీవల చాలా తేలికైంది. ఇందుకోసం జనరేటివ్ ఏఐ టూల్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లోకి వెళ్లి, సైన్ఇన్ అయ్యి ఇష్టమైన ఇమేజ్‌లను ఇట్టే సృష్టించుకోవచ్చు -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్‌ను కాదని హార్దిక్‌కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు