sunday tip: FB డీయాక్టివేట్‌.. డిలీట్‌ ఎలాగంటే?

 ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగించే సామాజిక మాధ్యమాల్లో ఫేస్‌బుక్‌ (FACEBOOK)ఒకటి. దాదాపు 553 మిలియన్ల..

Updated : 06 Jun 2021 20:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగించే సామాజిక మాధ్యమాల్లో ఫేస్‌బుక్‌ (FACEBOOK) ఒకటి. దాదాపు 553 మిలియన్ల యూజర్లు ఫేస్‌బుక్‌ను వాడుతుంటారు. వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో పర్సనల్‌ డేటా భద్రతకు సంబంధించి యూజర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ డేటాను తెలిసిన వారికే కాకుండా వ్యాపార, సామాజిక సంస్థలతో పంచుకుంటున్నారనే వదంతులు వ్యాపిస్తున్నాయి. అంతేకాకుండా అసభ్యకరమైన మెసేజ్‌లు, వీడియోలు వస్తుండటంతో తమ ఖాతాను తాత్కాలికంగా డీయాక్టివేట్ చేసేందుకు పలువురు యూజర్లు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారి కోసం ఖాతాను డీయాక్టివేట్‌ లేదా డిలీట్‌ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. 

ఓ ఖాతాను కొంతకాలంపాటు డీయాక్టివేట్‌ చేసి తర్వాత అవసరమైనప్పుడు మరలా యాక్టివేట్‌ చేసుకునే అవకాశం ఉంది. అయితే పూర్తిగా తొలగించాలనుకుంటే మాత్రం ఫేస్‌బుక్‌ రెండు వారాలపాటు గడువు ఇస్తుంది. ఈలోపు రీయాక్టివేట్‌ చేసుకోవచ్చు. అలా చేయకపోతే పర్మినెంట్‌గా ఖాతా డిలీట్‌ అయిపోతుంది. డెస్క్‌టాప్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఫేస్‌బుక్‌ డీయాక్టివేషన్‌ లేదా డిలీట్‌ ప్రాసెస్‌ ఒకేలా ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఆప్షన్లు ఒక్కో ఫోన్‌లో ఒక్కో విధంగా ఉంటాయి. 

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఇలా..

* ఫేస్‌బుక్‌లోని సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేసి ‘సెట్టింగ్స్‌ అండ్‌ ప్రైవసీ’ క్లిక్ చేయాలి. 
* తర్వాత సెట్టింగ్స్‌ విభాగం ఓపెన్ చేయాలి
* యువర్‌ ఫేస్‌బుక్ ఇన్‌ఫర్మేషన్‌ విభాగంలో అకౌంట్ ఓనర్‌షిప్‌ అండ్‌ కంట్రోల్‌ క్లిక్‌ చేయాలి
* మూడు ఆప్షన్లు వస్తాయి. 
* అందులో డీయాక్టివేషన్ అండ్‌ డిలీషన్‌ను క్లిక్ చేయాలి
* డీయాక్టివేట్‌ అకౌంట్, డిలీట్ అకౌంట్‌ ఆప్షన్లలో మీకు ఏది కావాలో అది ఎంచుకోవాలి. 
* ఒక వేళ డీయాక్టివేషన్‌ అకౌంట్‌ను ఓకే చేస్తే మీ ఖాతా డీయాక్టివేట్‌ అయిపోతుంది. 
* డిలీట్ చేస్తే.. ఓ రెండు వారాల తర్వాత ఖాతాను ఫేస్‌బుక్‌ తొలగిస్తుంది..

 

 డెస్క్‌టాప్‌లో ఇలా...

* డెస్క్‌టాప్‌లో ఫేస్‌బుక్‌ లాగిన్‌ కావాలి. 
* సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. 
* యువర్‌ ఫేస్‌బుక్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి
* డీయాక్టివేషన్‌ అండ్ డిలీషన్‌ ఆప్షన్‌ ఉంటుంది. దానిని ఓపెన్ చేయాలి.
* డీయాక్టివేట్‌ గానీ డిలీట్‌ గానీ చేసే అవకాశం ఉంటుంది. 
* కొంతకాలం పాటు ఫేస్‌బుక్‌ ఖాతాను నిలిపి ఉంచేందుకు డీయాక్టివేట్‌ చేస్తే సరిపోతుంది. దీని వల్ల మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరూ చూడలేరు. మీరూ ఎలాంటి పోస్టులు పెట్టేందుకు వీలుపడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని