మట్టికి నీటి మాత్రలు!

ఏదైనా జబ్బు చేస్తే గొట్టం మాత్రలు (క్యాప్సూల్స్‌) వేసుకోవటం తెలిసిందే. మరి నీటి గొట్టం మాత్రలను ఎప్పుడైనా చూశారా? ఇవి మన దాహం తీర్చటానికి కాదు. మట్టి దాహం తీర్చటానికి. వీటిని హైడ్రోజెల్స్‌ అంటారు. కొద్ది సంవత్సరాల కిందటే తయారుచేసినా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి.

Published : 26 May 2021 00:54 IST

ఏదైనా జబ్బు చేస్తే గొట్టం మాత్రలు (క్యాప్సూల్స్‌) వేసుకోవటం తెలిసిందే. మరి నీటి గొట్టం మాత్రలను ఎప్పుడైనా చూశారా? ఇవి మన దాహం తీర్చటానికి కాదు. మట్టి దాహం తీర్చటానికి. వీటిని హైడ్రోజెల్స్‌ అంటారు. కొద్ది సంవత్సరాల కిందటే తయారుచేసినా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. హైడ్రోజెల్‌ పరిజ్ఞానాన్ని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ) రూపొందించింది. తనకుతానే క్షీణించే పిండి పదార్థంతో తయారుచేసిన జెల్స్‌ తమ బరువు కన్నా 400 రెట్లు ఎక్కువగా నీటిని పీల్చుకొని, పట్టి ఉంచగలవు. వీటిని నేలలో కాస్త లోతుగా.. మొక్కల వేళ్లకు సమీపంలో పాతాల్సి ఉంటుంది. నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి పీల్చుకొని, దాచుకుంటాయి. నేల పొడిబారినప్పుడు తమలోని నీటిని మట్టికి అందిస్తాయి. ఇలా తేమ తగ్గకుండా కాపాడతాయి. ఒకసారి పాతితే మూడు నెలల వరకు ఉపయోగపడతాయి. పాలీబ్యాగులు, కుండీల్లో పెంచే కూరగాయలకు నాలుగు గొట్టాలు సరిపోతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు