సహారా పూవై విరియగా..

ఎడారిలో మొక్కలు మొలవటమే కష్టం. మొలిచినా నీటి ఎద్దడిని, వేడిని తట్టుకొని బతకటం ఇంకా కష్టం. ఇంతటి క్లిష్టమైన పరిస్థితులనూ తట్టుకొని పొద్దు తిరుగుడు మొక్క చిగురిస్తే? పూవులు పూస్తే? అంతా

Updated : 02 Jun 2021 04:37 IST

ఎడారిలో మొక్కలు మొలవటమే కష్టం. మొలిచినా నీటి ఎద్దడిని, వేడిని తట్టుకొని బతకటం ఇంకా కష్టం. ఇంతటి క్లిష్టమైన పరిస్థితులనూ తట్టుకొని పొద్దు తిరుగుడు మొక్క చిగురిస్తే? పూవులు పూస్తే? అంతా సూపర్‌ జీన్స్‌ మహత్మ్యం. కొన్ని మొక్కలు, పక్షులు, చీమలు ఇలాంటి జన్యువులను కలిగుంటాయి. వీటిల్లో డీఎన్‌ఏ సముదాయాలు చాలా పెద్దగా ఉంటాయి. ప్రెయిరీ పొద్దు తిరుగుడు మొక్క దీనికి మంచి ఉదాహరణ. దీనిలో 37 వరకు సూపర్‌జీన్స్‌ విభాగాలున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవే వేడి వాతావరణాన్ని, వారాల కొద్దీ నీరు లేకపోయినా తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించి పెడుతున్నాయి. వీటి విత్తనాల పరిమాణం, పూవులు పూసే కాలం, ఇతర వాతావరణాలకు అనుగుణంగా మారేలా చేయటం వంటి అంశాలపై సూపర్‌ జన్యువులు గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. జీవులు, మొక్కలు పక్కపక్కనే నివసిస్తూ, ఒకదాంతో మరోటి జతకడుతూ కూడా ప్రత్యేకమైన గుణాలను ఎలా సంతరించుకుంటాయో, విశిష్టమైన జాతులుగా ఎలా రూపొందుతాయో అనేది తెలుసుకోవటానికి సూపర్‌ జీన్స్‌ ఉపయోగపడగలవని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని