ఫొటో సమాచారం సవరించొచ్చు

తాజాగా ఐఫోన్‌ను ఐఓఎస్‌15కు అప్‌డేట్‌ చేశారా? ఒకసారి ఫొటోస్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, ఇమేజ్‌ను సెలెక్ట్‌ చేసి, పైకి స్వైప్‌ చేసి చూడండి. ఏవేవో అంకెలు, సమాచారం కనిపిస్తున్నాయా? దీన్నే ఎక్స్‌ఛేంజెబుల్‌ ఇమేజ్‌ ఫైల్‌ (ఎక్జిఫ్‌) డేటా అంటారు. మనం ఫోన్‌తో ఫొటో తీసినప్పుడు

Published : 13 Oct 2021 01:04 IST

తాజాగా ఐఫోన్‌ను ఐఓఎస్‌15కు అప్‌డేట్‌ చేశారా? ఒకసారి ఫొటోస్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, ఇమేజ్‌ను సెలెక్ట్‌ చేసి, పైకి స్వైప్‌ చేసి చూడండి. ఏవేవో అంకెలు, సమాచారం కనిపిస్తున్నాయా? దీన్నే ఎక్స్‌ఛేంజెబుల్‌ ఇమేజ్‌ ఫైల్‌ (ఎక్జిఫ్‌) డేటా అంటారు. మనం ఫోన్‌తో ఫొటో తీసినప్పుడు ఇమేజ్‌తో పాటు ఫొటో తీసిన తేదీ, సమయం, లొకేషన్‌, కెమెరా మోడల్‌, లెన్స్‌ రకం, కెమెరా సెటింగ్స్‌, ఇమేజ్‌ రెజల్యూషన్‌, పిక్సెల్‌ డైమెన్షన్‌, సైజు వంటి వివరాలూ సేవ్‌ అవుతాయి.  ఇంతకుముందు ఐఫోన్‌లో వీటిని చూడాలంటే థర్డ్‌ పార్టీ యాప్‌లతోనే సాధ్యమయ్యేది. ఐఓఎస్‌ 15 రాకతో ఇది చాలా తేలికైంది. ఇప్పుడు పైకి స్వైప్‌ చేస్తే చాలు. ఇట్టే ప్రత్యక్షమవుతాయి. ఫొటోను సెలెక్ట్‌ చేసి, ఇన్ఫర్మేషన్‌ గుర్తు మీద ట్యాప్‌ చేసి కూడా వీటిని చూడొచ్చు. అవసరమైతే కొంత సమాచారాన్ని సవరించుకోవచ్చు కూడా.

మార్చటమెలా?
ఏదైనా ఫొటో డేటాను ఓపెన్‌ చేసి, పైభాగాన కనిపించే ఎంటర్‌ ఎ క్యాప్షన్‌ ఫీచర్‌ను ఎంచుకోవాలి. ‘యాడ్‌ ఎ క్యాప్షన్‌’ మీద ట్యాప్‌ చేసి, ఇష్టమైన విషయాన్ని టైప్‌ చేయాలి. ఇది ఫొటో దేనికి సంబంధించిందనేది తేలికగా గుర్తించటానికి వీలు కల్పిస్తుంది. ఫొటో గురించి నోట్స్‌ తయారు చేసుకోవటమూ సులభమవుతుంది. దీని కిందే ఫొటో తీసిన సమయం, తేదీ, వారం వివరాలూ కనిపిస్తాయి. వీటి పక్కన ఉండే ‘అడ్జస్ట్‌’ ఫీచర్‌ను ఎంచుకొని సమాచారాన్ని సవరించుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకున్న, ఇతరులు పంపించిన ఫొటోలకు సంబంధించిన తేదీని సరి చేసుకోవచ్చు. అడ్జస్ట్‌మెంట్‌ మెనూలోకి వెళ్లగానే ఒరిజినల్‌ తేదీ, సమయం (వీటిని మార్చటం సాధ్యం కాదు).. అడ్జస్టెడ్‌ తేదీ, సమయం కనిపిస్తాయి. క్యాలెండర్‌ను ట్యాప్‌ చేసి ఏదైనా తేదీని ఎంచుకోవచ్చు. కావాలనుకుంటే చాలాకాలం కిందటి సంవత్సరాలనూ ఎంచుకోవచ్చు. సమయం, టైమ్‌ జోన్‌ను కూడా మార్చుకోవచ్చు. ఫొటోతో పాటు దాన్ని ఎక్కడ తీశామన్నదీ (లొకేషన్‌) నమోదవుతుంది. ఇది వద్దనుకుంటే అడ్జస్ట్‌ ఫీచర్‌ మీద నొక్కి, సెర్చ్‌ బాక్స్‌ కుడివైపున ఉండే ‘ఎక్స్‌’ను నొక్కాలి. తర్వాత ‘నో లొకేషన్‌’ ఫీచర్‌ను ఎంచుకోవాలి. ఇతరులు పంపిన ఫొటోలతోనూ వాటికి సంబంధించిన వివరాలు అందుతాయి. అవతలివారు ఫొటోలను లొకేషన్‌తో లింక్‌ చేసుకొని ఉంటే అదీ జత అవుతుంది మరి. దీన్ని ఎప్పటికప్పుడు డిలీట్‌ చేసుకోవటం మంచిది. ఒకవేళ ఫొటోలతో పాటు లొకేషన్‌ సమాచారం పంపొద్దని అనుకుంటే- ఇమేజ్‌ను పంపటానికి ముందుగా ఎడిట్‌ చేసుకోవచ్చు. లేదంటే లొకేషన్‌ సమాచారాన్ని మొత్తంగానే నిర్మూలించుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ప్రైవసీ విభాగంలోకి వెళ్లాలి. లొకేషన్‌ సర్వీసెస్‌ నుంచి కెమెరా, ఫొటోస్‌ రెండింటినీ ఎంచుకొని ‘నెవర్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని