ట్విటర్‌ సాఫ్ట్‌ బ్లాక్‌

ఫాలోవర్‌ని బ్లాక్‌ చేయకుండా సున్నితంగా తొలగించుకునేలా ట్విటర్‌ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇందుకోసం మన ప్రొఫైల్‌లోకి వెళ్లి ఫాలోవర్స్‌ ఫీచర్‌ను క్లిక్‌ చేయాలి. ఫాలోవర్‌ పక్కనుండే మూడు చుక్కల మెనూను

Published : 13 Oct 2021 01:07 IST

ఫాలోవర్‌ని బ్లాక్‌ చేయకుండా సున్నితంగా తొలగించుకునేలా ట్విటర్‌ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇందుకోసం మన ప్రొఫైల్‌లోకి వెళ్లి ఫాలోవర్స్‌ ఫీచర్‌ను క్లిక్‌ చేయాలి. ఫాలోవర్‌ పక్కనుండే మూడు చుక్కల మెనూను క్లిక్‌ చేస్తే ‘రిమూవ్‌ దిస్‌ ఫాలోవర్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకోవటం ద్వారా ఫాలోవర్‌ను తొలగించుకోవచ్చు. ఈ విషయం ఫాలోవర్‌కు తెలియదు కూడా. మామూలుగా ఎవరినైనా బ్లాక్‌ చేస్తే వాళ్లకి మన ట్వీట్లు కనిపిస్తూనే ఉంటాయి. డైరెక్ట్‌ మెసేజ్‌ చేసే అవకాశమూ ఉంటుంది. కొత్త ఫీచర్‌తో అలాంటి అవకాశం ఉండదు. మళ్లీ ఫాలో అయితే గానీ మన ట్వీట్లు కనిపించవు. ఒకవేళ ప్రొటెక్టెడ్‌ ట్వీట్స్‌ను కలిగున్నట్టయితే మన అనుమతి తీసుకున్నాకే తిరిగి ఫాలో కావటానికి వీలుంటుంది. పరస్పర దూషణలతో చర్చ వేడెక్కకుండా హెచ్చరించే ఫీచర్‌ మీదా ట్విటర్‌ పరీక్షలు నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని