ఆటో బ్రైట్‌నెస్‌ ఆగిందా?

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఆటో బ్రైట్‌నెస్‌ బాగా ఉపయోగపడుతుంది. చుట్టుపక్కల కాంతిని బట్టి ఫోన్‌ తెర దానంతటదే ప్రకాశాన్ని పెంచుకోవటమో, తగ్గించుకోవటమో చేస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ ఫీచర్‌ పనిచేయకపోవచ్చు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి.

Published : 23 Feb 2022 01:07 IST

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఆటో బ్రైట్‌నెస్‌ బాగా ఉపయోగపడుతుంది. చుట్టుపక్కల కాంతిని బట్టి ఫోన్‌ తెర దానంతటదే ప్రకాశాన్ని పెంచుకోవటమో, తగ్గించుకోవటమో చేస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ ఫీచర్‌ పనిచేయకపోవచ్చు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. వీటిల్లో ఒకటి కాంతిని పసిగట్టే సెన్సర్‌ పనిచేయకపోవటం. ఇది పనిచేస్తుందో లేదో తెలుసుకోవటానికి కొన్ని ఫోన్లలో బిల్టిన్‌ ఆప్షన్‌ ఉంటుంది. కావాలంటే థర్డ్‌ పార్టీ యాప్స్‌ సాయంతోనూ దీన్ని తెలుసుకోవచ్చు. సెన్సర్‌ టెస్ట్‌ యాప్‌ ఇలాంటిదే. ఇది ఉచితంగానే అందుబాటులో ఉంది. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకొని, ఓపెన్‌ చేయాలి. అవసరమైన అనుమతులు ఇవ్వాలి. అప్పుడు గుర్తించిన సెన్సర్లన్నీ తెర మీద కనిపిస్తాయి. ‘లైట్‌ సెన్సర్‌’ కోసం ‘టెస్ట్‌’ బటన్‌ను నొక్కాలి. తర్వాత అరచేతిని లైట్‌ సెన్సర్‌ దగ్గరకు తీసుకురావాలి. ప్రకాశం తగ్గుతున్నట్టయితే సెన్సర్‌ సక్రమంగా పనిచేస్తున్నట్టే. ప్రకాశం మారకపోతే హార్డ్‌వేర్‌ను మార్చాల్సి ఉందని అర్థం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని