వాట్సప్‌ స్టేటస్‌లో లొకేషన్‌ స్టికర్‌!

వాట్సప్‌లో లొకేషన్‌ షేర్‌ చేసుకోవటం మామూలే. ఇది ఏదో ఒకరికో, గ్రూపులో ఉన్నవారికో కనిపిస్తుంది. మరి కాంటాక్ట్స్‌ జాబితాలో ఉన్న అందరికీ కనిపించాలంటే? స్టేటస్‌లో స్టికర్‌గా పెట్టుకుంటే సరి.

Published : 27 Apr 2022 01:55 IST

వాట్సప్‌లో లొకేషన్‌ షేర్‌ చేసుకోవటం మామూలే. ఇది ఏదో ఒకరికో, గ్రూపులో ఉన్నవారికో కనిపిస్తుంది. మరి కాంటాక్ట్స్‌ జాబితాలో ఉన్న అందరికీ కనిపించాలంటే? స్టేటస్‌లో స్టికర్‌గా పెట్టుకుంటే సరి. వాట్సప్‌ ఇటీవలే దీన్ని పరీక్షించటం ఆరంభించింది. దీంతో ప్రస్తుత లొకేషన్‌ గానీ మ్యాప్‌ నుంచి ఇతర లొకేషన్‌ను గానీ స్టేటస్‌లో షేర్‌ చేసుకోవచ్చు. దీన్ని వాడుకోవాలంటే..

* ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేయాలి.
* హోంస్క్రీన్‌ను కుడివైపునకు జరపాలి. (స్టేటస్‌ విభాగం ద్వారానైతే ఇన్‌యాప్‌ కెమెరా బటన్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది). ఐఫోన్‌ వాడేవారైతే కుడివైపునకు స్వైప్‌ చేశాక కెమెరా గుర్తు మీద ట్యాప్‌ చేయాలి.
* ఇప్పుడు షేర్‌ చేయాలనుకునే ఫొటోను గానీ వీడియోను గానీ ఎంచుకోవాలి.
* తర్వాత ఎడిటింగ్‌ విండోలో పైన కనిపించే ఎమోజీ ఐకన్‌ మీద ట్యాప్‌ చేయాలి.
* ఇందులో స్టికర్‌ విభాగం కింద గడియారం పక్కనుంటే లొకేషన్‌ స్టికర్‌ను నొక్కాలి. తర్వాత ప్రస్తుత లొకేషన్‌ను గానీ సెర్చ్‌ బార్‌ సాయంతో ఇష్టమైన లొకేషన్‌ను గానీ గుర్తించి ఎంచుకోవాలి.
* అప్పుడు లొకేషన్‌తో కూడిన స్టికర్‌ స్టేటస్‌ మీద కనిపిస్తుంది. దీన్ని ట్యాప్‌ చేసి డిజైన్‌ను మార్చుకోవచ్చు, ఇతర స్టికర్ల మాదిరిగా ఎక్కడికైనా జరుపుకోవచ్చు.
* అంతా పూర్తయ్యాక స్టేటస్‌లో షేర్‌ చేసుకుంటే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు