ఐఫోన్‌ నుంచి ఆండ్రాయిడ్‌కు

పాత ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నుంచి కొత్త ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు యాప్స్‌, కాంటాక్ట్స్‌, మెసేజెస్‌, ఫొటోస్‌ బదిలీ చేయటం చాలా తేలిక. వైర్‌లెస్‌గా గానీ యూఎస్‌బీ కేబుల్‌తో గానీ చేసుకోవచ్చు. కానీ ఐఫోన్‌ నుంచి...

Published : 20 Apr 2022 02:05 IST

పాత ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నుంచి కొత్త ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు యాప్స్‌, కాంటాక్ట్స్‌, మెసేజెస్‌, ఫొటోస్‌ బదిలీ చేయటం చాలా తేలిక. వైర్‌లెస్‌గా గానీ యూఎస్‌బీ కేబుల్‌తో గానీ చేసుకోవచ్చు. కానీ ఐఫోన్‌ నుంచి ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు డేటాను బదిలీ చేయటం అంత తేలిక కాదు. ముందుగా గూగుల్‌ డ్రైవ్‌కు డేటాను బ్యాకప్‌ చేసుకొని, మాన్యువల్‌గా రిస్టోర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 12 రాకతో ఇది కాస్త తేలికైంది. లైట్‌నింగ్‌ కేబుల్‌ కనెక్షన్‌తో కాపీ చేసుకోవటం సాధ్యమైంది. ఇకపై ఇది మరింత తేలిక కానుంది. గూగుల్‌ తాజాగా ఐఓఎస్‌ కోసం ఉచిత యాప్‌ను విడుదల చేసింది మరి. వైర్‌లెస్‌గా పనిచేసే దీని పేరు ‘స్విచ్‌ టు ఆండ్రాయిడ్‌’. దీంతో ఐఫోన్‌ నుంచి ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు ఫొటోలు, వీడియోలు, కాంటాక్టులు, క్యాలెండర్‌ ఈవెంట్ల వంటి వాటిని త్వరగా, సురక్షితంగా కాపీ చేసుకోవచ్చు. ఇది అన్‌లిస్టెడ్‌ యాప్‌. యాప్‌ స్టోర్‌లో సెర్చ్‌ చేస్తే కనిపించదు. డైరెక్ట్‌ లింక్‌ ద్వారానే అందుబాటులో ఉంటుంది.
ఈ యాప్‌ను https://apps.apple.com/us/app/id1581816143 లింక్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఐఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక అవసరమైన అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సెటప్‌, రిస్టోర్‌ ప్రక్రియలో భాగంగా ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో కనిపించే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలని అడుగుతుంది. స్కాన్‌ చేయగానే ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో హాట్‌స్పాట్‌ జనరేట్‌ అవుతుంది. ఇది ఐఫోన్‌తో కనెక్ట్‌ కావటానికి మార్గం సుగమం చేస్తుంది. తర్వాత కావాల్సిన డేటాను మార్పిడి చేసి పెడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని