పసిఫిక్‌లో బంగారు గుడ్డు!

గురించి తెలిసింది కొంతే. తెలియని రహస్యాలు ఎన్నో. ఇటీవల పసిఫిక్‌ మహా సముద్రం అడుగున అలాంటి వింత ఒకటి బయటపడింది. గుండ్రంగా, బంగారు వర్ణంలో మెరుస్తోన్న ఇది శాస్త్రవేత్తలకే అమితాశ్చర్యం కలిగిస్తోంది. ‘

Updated : 20 Sep 2023 22:13 IST

మనకు భూమి గురించి తెలిసింది కొంతే. తెలియని రహస్యాలు ఎన్నో. ఇటీవల పసిఫిక్‌ మహా సముద్రం అడుగున అలాంటి వింత ఒకటి బయటపడింది. గుండ్రంగా, బంగారు వర్ణంలో మెరుస్తోన్న ఇది శాస్త్రవేత్తలకే అమితాశ్చర్యం కలిగిస్తోంది. ‘బంగారు గుడ్డు’గా అభివర్ణిస్తున్న దీన్ని నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫెరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పరిశోధక బృందం గుర్తించింది. అంతరించిన ఓ అగ్ని పర్వతాన్ని శోధిస్తున్న క్రమంలో అనూహ్యంగా బయటపడింది. ఇదేంటో చూద్దామని దీని మీదికి కెమెరాను జూమ్‌ చేసిన శాస్త్రవేత్తలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మొదట్లో పగడాలకు అంటుకున్న మృత సముద్రజీవి అని అనుకున్నారు. కాదు కాదు, గుడ్డు పెంకు కావొచ్చని భావించారు. చివరికి ఇదేంటో తెలియక పరిశోధనకు దిగారు. ఇది ఇప్పటికే మనకు తెలిసిన ప్రాణికి సంబంధించిందా? లేదా కొత్త జీవికి చెందిందా? ప్రస్తుతం ఉనికిలో ఉన్న ప్రాణికి సంబంధించి మనకు తెలియని స్థితా? అన్నది ఇంకా బయటపడలేదు. నాలుగు అంగుళాల వ్యాసం గల ఈ బంగారు గుడ్డు అడుగున చిన్న రంధ్రం కూడా ఉంది. దీన్ని శాస్త్రవేత్తలు నౌకలోకి తీసుకొచ్చి, పరిశోధనలు చేస్తున్నారు. ఏదేమైనా ఈ సృష్టిలో మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉందనే విషయాన్ని ఇది మరోసారి గుర్తు చేసిందనటంలో సందేహం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని