సైట్‌లను యాప్‌లుగా మార్చేద్దాం!

ఎక్కువ యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తే ఏమవుతుంది? ప్రాసెసింగ్‌ వేగం తగ్గుతుంది.. బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. అంతేకాదు.. యాప్‌లన్నీ రకరకాల అనుమతులు కోరుతూ మీ డేటాపై ఓ కన్నేస్తుంటాయి. అందుకే వీలైనంత వరకూ యాప్‌ల వాడకాన్ని ఫోన్‌లో తగ్గించాలంటే? ఏముందీ.. ఆయా యాప్‌లకు సంబంధించిన వెబ్‌సైట్‌లను ఫోన్‌లో యాప్‌లుగా ఓపెన్‌ చేస్తే పోలా! అంటే.. పదే పదే బ్రౌజర్‌ ద్వారా వెబ్‌సైట్‌లను ఓపెన్‌ చేయకుండా..

Updated : 12 Oct 2022 11:52 IST

వాడి చూద్దురూ!

ఎక్కువ యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తే ఏమవుతుంది? ప్రాసెసింగ్‌ వేగం తగ్గుతుంది.. బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. అంతేకాదు.. యాప్‌లన్నీ రకరకాల అనుమతులు కోరుతూ మీ డేటాపై ఓ కన్నేస్తుంటాయి. అందుకే వీలైనంత వరకూ యాప్‌ల వాడకాన్ని ఫోన్‌లో తగ్గించాలంటే? ఏముందీ.. ఆయా యాప్‌లకు సంబంధించిన వెబ్‌సైట్‌లను ఫోన్‌లో యాప్‌లుగా ఓపెన్‌ చేస్తే పోలా! అంటే.. పదే పదే బ్రౌజర్‌ ద్వారా వెబ్‌సైట్‌లను ఓపెన్‌ చేయకుండా.. సింపుల్‌గా ఒక్కసారి ట్యాప్‌ చేసి యాప్‌ల మాదిరిగా వెబ్‌సైట్‌లను ఓపెన్‌ చేయడం అన్నమాట. నెట్టింట్లో మీరు యాక్సెస్‌ చేస్తున్న చాలా వరకూ వెబ్‌సైట్‌లను ఈ తరహా యాప్‌లుగా మార్చుకోవచ్చు. అందుకు తగిన ఆండ్రాయిడ్‌ అప్లికేషన్లు కొన్ని ఉన్నాయి. వాటిని వాడుకుని వర్చువల్‌గా ఎలాంటి వెబ్‌సైట్‌ని అయినా ఆండ్రాయిడ్‌ యాప్‌గా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం!

గూగుల్‌ ప్లే అడ్డాలో యాప్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లెక్కకు మిక్కిలి చాలానే ఉంటాయ్‌. వెబ్‌సైట్‌లను ఆండ్రాయిడ్‌ యాప్‌ల మాదిరిగా మార్చేసేవి కూడా చాలానే ఉన్నాయి. అయితే, వాటిల్లో ఓ మూడింటిని మాత్రం కచ్చితంగా ప్రయత్నించొచ్చు. Hermit, Native Alpha, Google Chrome ఇవే ఆ మూడు. ముందుగా ‘హెర్మిట్‌’ని ప్రయత్నించి చూడండి. ఎందుకంటే.. ఈ విభాగంలో ఎక్కువ మంది మొబైల్‌ యూజర్లను ఆకట్టుకుంది. ఇక రెండోది ‘నేటీవ్‌ ఆల్ఫా’.. ఓపెన్‌సోర్స్‌ అప్లికేషన్‌. మూడోది గూగుల్‌ క్రోమ్‌లో అందించే వెబ్‌ ఆప్షన్‌.


‘బిల్ట్‌ఇన్‌’గా చాలానే ఉన్నాయి..
Hermit

దైనా వెబ్‌సైట్‌ని లైట్‌ మొబైల్‌గా మార్చేందుకు అనువైంది. దీన్ని ఉచితంగా వాడుకోవచ్చు. ప్లే స్టోర్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక యాప్‌ని క్రియేట్‌ చేయడంతో పాటు డార్క్‌ థీమ్‌ని కూడా సెట్‌ చేసుకోవచ్చు. దీంట్లో రెండు రకాలుగా లైట్‌ యాప్‌లను క్రియేట్‌ చేసుకునే వీలుంది. ముందు ‘రెడీ-మేడ్‌’గా యాప్‌ల జాబితాని చూడొచ్చు. అందుకు యాప్‌ హోం స్క్రీన్‌పై కనిపించే ప్లస్‌ గుర్తుని క్లిక్‌ చేయాలి. దీంతో అందుబాటులో ఉన్న అన్ని యాప్‌లు కనిపిస్తాయి. ఉదాహరణకు వాటిల్లో ‘వికిపీడియా’ ఉంది అనుకుంటే.. దాన్ని సెలెక్ట్‌ చేయగానే ఫోన్‌ హోం స్క్రీన్‌పై షార్ట్‌కట్‌లా వచ్చేస్తుంది. ఇక ఎప్పుడైనా వికిపీడియా ఓపెన్‌ చేయాల్సివస్తే.. షార్ట్‌కట్‌ని తాకితే చాలు. ఇదే మాదిరిగా యాప్‌లో బిల్ట్‌ఇన్‌గా అందుబాటులో ఉన్న అన్నింటినీ లైట్‌ యాప్‌లుగా ఫోన్‌కి జత చేయొచ్చు. ఒకవేళ మీరేదైనా వెబ్‌సైట్‌ని యాప్‌లా పొందాలనుకుంటే? అప్పుడు యాప్‌ హో స్క్రీన్‌ కింది టైప్‌ యూఆర్‌ఎల్‌ బాక్స్‌లో వెబ్‌సైట్‌ని ఎంటర్‌ చేయాలి. తర్వాత సెట్టింగ్స్‌ గుర్తుని తాకి ‘క్రియేట్‌ ఎ లైట్‌ యాప్‌’ ఆప్షన్‌తో వెబ్‌సైట్‌ని యాప్‌గా మార్చేయవచ్చు. ఇలా క్రియేట్‌ చేసిన యాప్‌ హోం స్క్రీన్‌లోకి రావాలంటే ‘యాడ్‌ టూ హోం స్క్రీన్‌’ ఆప్షన్‌ని చెక్‌ చేయాలి. అంతేకాదు, కావాలంటే వాటిని ‘డార్క్‌ మోడ్‌’లోనూ ఓపెన్‌ చేసుకోవచ్చు. ఫుల్‌స్క్రీన్‌ ఇంటర్ఫేస్‌లోనూ పెట్టుకుని చూడొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: http:bit.ly/3t6tqyf


ఓపెన్‌సోర్స్‌ రూపకల్పన
Native Alpha

ప్లే స్టోర్‌ నుంచి కాకుండా ప్రత్యేకంగా సెటప్‌ ఫైల్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని ‘నేటివ్‌ ఆల్ఫా’ యాప్‌ని ప్రయత్నించొచ్చు. ఎందుకంటే.. ఇదో ఓపెన్‌సోర్స్‌ కమ్యూనిటీ యాప్‌. ప్రి-రిలీజ్‌ దశలోనే ఉండడం వల్ల ఇంకా ప్లే స్టోర్‌లోకి రాలేదు. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని రన్‌ చేస్తే.. ‘ప్లస్‌’ గుర్తుతో యాప్‌ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్‌ చేసి.. ఏ వెబ్‌సైట్‌ని అయితే లైట్‌ యాప్‌గా మార్చాలనుకుంటున్నారో దాని యూఆర్‌ఎల్‌ని ఎంటర్‌ చేయాలి. అలాగే, యాప్‌కి ఐకాన్‌ గుర్తుగా ఏదో ఒకటి ఎంచుకోవాలి. దీంతో హోం పేజీలో యాప్‌ల వెబ్‌సైట్‌ దర్శనమిస్తుంది. తాకితే చాలు.. యాప్‌ మాదిరిగా సైట్‌ తెరపై కనిపిస్తుంది.
డౌన్‌లోడ్‌ లింక్‌: http:bit.ly/3eOSBBy


వెబ్‌ యాప్‌లు కావాలా?
Google Chrome

లాంటి యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేయకుండానే ఆండ్రాయిడ్‌ యూజర్లు వెబ్‌సైట్‌లను యాప్‌లుగా హోం స్క్రీప్‌పై పెట్టుకోవచ్చు. వీటినే ‘ప్రోగ్రెసివ్‌ వెబ్‌ యాప్‌’లుగా పిలుస్తున్నారు. వీటిని క్రియేట్‌ చేయడం చాలా సులభం. క్రోమ్‌ బ్రౌజర్‌ని ఓపెన్‌ చేసి కావాల్సిన వెబ్‌సైట్‌ని ఓపెన్‌ చేయాలి. తర్వాత మూడు చుక్కలుగా కనిపించే మెయిన్‌ మెనూని సెలెక్ట్‌ చేయాలి. వచ్చిన డ్రాప్‌డౌన్‌ మెనూలో ‘యాడ్‌ టూ హోం స్క్రీన్‌’ని సెలెక్ట్‌ చేయాలి. తర్వాత హో స్క్రీన్‌పైకి చేరే యాప్‌కి టైటిల్‌ని మీకు కావాల్సింది పెట్టుకుని ‘యాడ్‌’ సెలెక్ట్‌ చేస్తే.. వెబ్‌సైట్‌ కాస్తా యాప్‌లా దర్శనమిస్తుంది. మీరు నిత్యం వీక్షించే వెబ్‌సైట్‌లను ఇలా షార్ట్‌కట్‌లుగా పెట్టుకోవడం ద్వారా క్షణాల్లో ఓపెన్‌ చేయవచ్చు. ఇలా లైట్‌, ప్రోగ్రెసివ్‌ వెబ్‌ యాప్‌లను క్రియేట్‌ చేయడం ద్వారా ఆయా సైట్‌లకు మీరెలాంటి అనుమతులు ఇవ్వాల్సిన పని లేదు. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లోనూ రన్‌ అవుతాయేమో అనే సందేహం అక్కర్లేదు. సురక్షితంగా.. స్వేచ్ఛగా వీటిని వాడుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు