
ఆండ్రాయిడ్ పరికరాల్లోనూ ట్విటర్ టిప్
ఐఓఎస్ పరికరాలకే పరిమితమైన ట్విటర్ టిప్ సదుపాయం ఇకపై ఆండ్రాయిడ్ పరికరాల్లోనూ అందుబాటులోకి రానుంది. ఇది కంటెంట్ క్రియేటర్లు, పాత్రికేయులతో పాటు ట్విటర్ వాడేవారు తమ ట్వీట్లను విక్రయించుకోవటానికి, టిప్స్ పొందటానికి వీలు కల్పిస్తుంది. దీని ద్వారా కంటెంట్‌ను సృష్టించినవారికి వినియోగదారులు తమకు తోచినంత డబ్బును బహుమతిగా పంపించుకోవచ్చు. క్రియేటర్లు తమ లింకులను బ్యాండ్క్యాంప్, క్యాష్ యాప్, పేట్రియాన్, పేపల్, విన్మో ఖాతాలకు షేర్ చేసుకోవచ్చు. వీటి ద్వారా అనుచరుల నుంచి డబ్బు రూపంలో టిప్స్ అందుకోవచ్చు. ఇందుకోసం ఎడిట్ ప్రొఫైల్ ద్వారా తమ ప్రొఫైల్‌కు టిప్స్ గుర్తును జోడించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంతమంది క్రియేటర్లు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంది. మున్ముందు ఎక్కువమందికి విస్తరించే అవకాశముంది. ట్విటర్ ఇటీవల ఐఓఎస్ పరికరాలు వాడేవారి (18 ఏళ్లు నిండిన) కోసం టిప్ జార్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు దీన్ని ఆండ్రాయిడ్ పరికరాలకూ విస్తరించటం ఆసక్తిని కలిగిస్తోంది. బిట్కాయిన్ల రూపంలోనూ టిప్స్ అందుకునేలా దీనికి మార్పులు చేయాలనీ భావిస్తోంది. అంతేకాదు.. ఫుల్ సైజు ఫొటోలకూ అనుమతించాలని ట్విటర్ అనుకుంటోంది. దీంతో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్‌లో ఆటో-క్రాపింగ్ ఆల్గోరిథమ్ రద్దవుతుంది. ట్విటర్ వినియోగదారులు తమ టైమ్‌లైన్‌లో పూర్తి స్థాయి దృశ్యాలను చూసుకోవటానికి వీలవుతుంది. ఫొటోలను పోస్ట్ చేసేటప్పుడే ప్రివ్యూలో అది ఎలా కనిపిస్తుందనేది చూసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.