ఉచిత యాప్స్‌తో బొమ్మలు గీసేయండి

కంప్యూటర్‌ మీద బొమ్మలు గీయాలని అనుకుంటున్నారా? అయితే ఉచిత డ్రాయింగ్‌ యాప్స్‌ను ప్రయత్నించి చూడండి. వీటిల్లో ఒకటి క్రిత. ఇందులో బ్రష్‌ స్టెబిలైజర్లు, బిల్టిన్‌ వెక్టార్‌ టూల్స్‌, బ్రష్‌ ఇంజిన్లు, రిసోర్స్‌ మేనేజర్‌ వంటి అత్యున్నత స్థాయి టూల్స్‌ చాలా ఉన్నాయి.

Updated : 17 Aug 2022 01:16 IST

కంప్యూటర్‌ మీద బొమ్మలు గీయాలని అనుకుంటున్నారా? అయితే ఉచిత డ్రాయింగ్‌ యాప్స్‌ను ప్రయత్నించి చూడండి. వీటిల్లో ఒకటి క్రిత. ఇందులో బ్రష్‌ స్టెబిలైజర్లు, బిల్టిన్‌ వెక్టార్‌ టూల్స్‌, బ్రష్‌ ఇంజిన్లు, రిసోర్స్‌ మేనేజర్‌ వంటి అత్యున్నత స్థాయి టూల్స్‌ చాలా ఉన్నాయి. దీని ఇంటర్ఫేస్‌, లేఅవుట్‌ కొత్తగా బొమ్మలు గీయటం ఆరంభించినవారికీ అనుగుణంగా ఉంటాయి. గ్రాఫిక్‌ డిజైన్‌, డిజిటల్‌ ఆర్ట్‌ ప్రక్రియలను ఇప్పుడిప్పుడే ప్రారంభించినవారికిది మంచి ఎంపిక. ఇక డిజిటల్‌ చిత్రాలకు సహజ రూపాన్ని ఇవ్వాలని కోరుకునే కళాకారులైతే క్లిప్‌ స్టూడియో పెయింట్‌ను వాడుకోవచ్చు. దీని శక్తిమంతమైన బ్రష్‌ ఇంజిన్‌ ప్రతి చిన్న గీతనూ గ్రహిస్తుంది. మనసులో ఉన్నట్టుగా బొమ్మను గీసుకునే వెసులుబాటు కల్పిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని