గూగుల్ సెర్చ్‌కు ఏఐ సొబగు
ఇకపై గూగుల్ సెర్చ్ అనుభవం గణనీయంగా మారనుంది. దీనికి జనరేటివ్ ఏఐ ఫీచర్‌ను జోడించారు మరి. ఇప్పటివరకూ అమెరికాకు మాత్రమే పరిమితమైన దీన్ని భారత్, జపాన్ దేశాలకూ గూగుల్ విస్తరించింది.
ఇకపై గూగుల్ సెర్చ్ అనుభవం గణనీయంగా మారనుంది. దీనికి జనరేటివ్ ఏఐ ఫీచర్‌ను జోడించారు మరి. ఇప్పటివరకూ అమెరికాకు మాత్రమే పరిమితమైన దీన్ని భారత్, జపాన్ దేశాలకూ గూగుల్ విస్తరించింది. కృత్రిమ మేధతో పనిచేసే దీని పేరు సెర్చ్ జనరేటివ్ ఎక్స్‌పీరియెన్స్ (ఎస్‌జీఈ).
ఎస్‌జీఈ మరింత సముచితమైన, సందర్భానికి తగిన సమాచారాన్ని మన ముందుంచుతుంది. గూగుల్‌లో మనం ఏదైనా కొత్త విషయం గురించి వెతుకుతున్నప్పుడు, ఏదైనా అంశానికి వివరణ కోసం అన్వేషిస్తున్నప్పుడు కొన్నిసార్లు అర్థం కాని అంశాలు కనిపించొచ్చు. లేదూ దాని గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకోవాలని భావించొచ్చు. ఇలాంటి సమయాల్లో తేలికగా శోధించటానికి ఎస్‌జీఈ తోడ్పడుతుంది. దీన్ని వాడుకోవటానికి ముందుగా క్రోమ్ బ్రౌజర్‌ను తెరచి, గూగుల్ ల్యాబ్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. గూగుల్ సెర్చ్ విభాగం కిందుండే ‘గెట్ స్టార్టెడ్’ బటన్ మీద క్లిక్ చేయాలి. అనంతరం గూగుల్ ఖాతాతో లాగిన్ కావాలి. తెలుసుకోవాల్సిన విషయాన్ని టైప్ చేసి, సెర్చ్ చేస్తే చాలు. దానంతటదే సారాంశం మొత్తం మొదట్లోనే ప్రత్యక్షమవుతుంది. ఇది మనదేశంలో ఇంగ్లిష్‌తో పాటు హిందీ భాషలోనూ అందుబాటులో ఉంటుంది. సమాచారాన్ని వినే సదుపాయమూ ఉంది. మాటలతోనూ ఆయా విషయాలను శోధించొచ్చు. యువతను ఈ ఫీచర్ బాగా ఆకర్షిస్తుండటం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World Cup 2023: వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. సీనియర్ ఆటగాడికి దక్కని చోటు
-
TET Results: 27న టెట్ ఫలితాలు.. ఎన్నిగంటలకంటే?
-
PM Modi: అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటన
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత
-
Social Look: శ్రీనిధి సెల్ఫీలు.. శ్రుతి హాసన్ హొయలు.. నుపుర్ ప్రమోషన్!