దారి చూపే ‘సెన్సర్లు’

డ్రైవర్‌ రహిత కార్లు.. ఎప్పటి నుంచో వింటున్నాం. ఇప్పటికే కొన్ని ‘సెల్ఫ్‌-డ్రైవింగ్‌’తో రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయ్‌ కూడా. అయితే, వాతావరణ పరిస్థితులన్నీ సక్రమంగా ఉన్నప్పుడు అవి బాగానే దూసుకెళ్తాయి. అమర్చిన సెన్సర్లు ముందున్న వాహనాల్ని చక్కగా గుర్తిస్తాయి. ఎలాంటి యాక్సిడెంట్‌లు జరగవు.

Updated : 24 Feb 2021 16:21 IST

డ్రైవర్‌ రహిత కార్లు.. ఎప్పటి నుంచో వింటున్నాం. ఇప్పటికే కొన్ని ‘సెల్ఫ్‌-డ్రైవింగ్‌’తో రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయ్‌ కూడా. అయితే, వాతావరణ పరిస్థితులన్నీ సక్రమంగా ఉన్నప్పుడు అవి బాగానే దూసుకెళ్తాయి. అమర్చిన సెన్సర్లు ముందున్న వాహనాల్ని చక్కగా గుర్తిస్తాయి. ఎలాంటి యాక్సిడెంట్‌లు జరగవు. కానీ, ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే! ఉదాహరణకు ఏ రాత్రి వేళలోనో.. పొగ మంచు ఉన్నప్పుడో.. తుఫానులప్పుడో.. సెన్సర్లు సరిగా పని చేయకుంటే? అప్పుడెలా? ఈ సమస్యని అధిగమించేందుకే యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా ఇంజినీర్లు సరికొత్త ‘రాడార్‌’ వ్యవస్థని రూపొందించారు. ఇప్పటికే సెల్ఫ్‌-డ్రైవింగ్‌ కార్లలో నిక్షిప్తం చేసిన రాడార్‌ సెన్సర్లు మరింత మెరుగ్గా పని చేసేందుకు ఈ కొత్త వ్యవస్థ తోడ్పతుంది. దీంతో పొగ మంచులో లేదా రాత్రి సమయాల్లో ముందు ఉన్న వాహనాలు, ఇతర ఆకారాల్ని స్పష్టంగా గుర్తించడం వీలవుతుంది. ఎక్కువ శాతం సెల్ఫ్‌-డ్రైవింగ్‌ కార్లు పగటి పూట లేజర్‌ కిరణాల సాయంతో ముందున్న ఆకారాల్ని గుర్తించి వాటిని 3డీ ఇమేజ్‌లుగా మార్చుకుని ముందుకు సాగిపోతుంటాయి. మరోవైపు పొగమంచు, దుమ్ము, వర్షం.. ఎక్కువగా ఉన్నప్పుడు శబ్ద తరంగాల సాయంతో పాక్షికంగా మాత్రమే ముందున్న వాటిని కార్లు గుర్తించగలుగుతున్నాయి. దీన్ని అధిగమించేందుకే  విశ్వవిద్యాలయం ఇంజినీర్లు సెల్ఫ్‌-డ్రైవింగ్‌ కార్లలోని రాడార్‌ వ్యవస్థని మరింత మెరుగుపరిచారు. కారు బానెట్‌పై నిర్ణీత దూరంలో రెండు రాడార్‌ సెన్సర్లను అమర్చుకుంటే చాలు. ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా ముందున్న వాటి ఆకారం, పరిమాణం వంటి వాటిని కచ్చితంగా అంచనా వేసేలా వాటిని రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని