ట్విటర్‌లో పిన్‌ కన్వర్జేషన్‌

ట్విటర్‌లో డైరెక్ట్‌ మెసేజెస్‌ గురించి తెలిసిందే. ఆయా చాట్లను పిన్‌ చేసుకునే సదుపాయమూ ఉంది. ఇలా ఆరు చాట్లను పిన్‌ చేసుకోవచ్చు.

Published : 26 Apr 2023 00:30 IST

ట్విటర్‌లో డైరెక్ట్‌ మెసేజెస్‌ గురించి తెలిసిందే. ఆయా చాట్లను పిన్‌ చేసుకునే సదుపాయమూ ఉంది. ఇలా ఆరు చాట్లను పిన్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ట్విటర్‌ గత సంవత్సరం ‘పిన్‌ కన్వర్జేషన్‌’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో ఎంచుకున్న చాట్స్‌ మన ఇన్‌బాక్స్‌లో అన్నింటికన్నా పైన కనిపిస్తాయి. ముఖ్యమైన వాటిని తేలికగా గుర్తించటానికిది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే చాలామందికి ఈ ఫీచర్‌ గురించి తెలియదు. దీన్ని వాడుకోవడ మెలాగో తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్‌లో..

ఫోన్‌లో ట్విటర్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. ఉత్తరం గుర్తు మీద తాకి ఇన్‌బాక్స్‌లోకి వెళ్లాలి. పిన్‌ చేసుకోవాలనుకునే ఛాట్‌ మీద కాసేపు నొక్కి పడితే ‘పిన్‌ కన్వర్జేషన్‌’ ఫీచర్‌ కనిపిస్తుంది. దీన్ని ట్యాప్‌ చేస్తే ఎనేబుల్‌ అవుతుంది.

వెబ్‌లో..

డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్‌టాప్‌లో ట్విటర్‌ పేజీని ఓపెన్‌ చేయాలి. కుడివైపు కింద మూలకు కనిపించే మెసేజెస్‌ మీద క్లిక్‌ చేయాలి. చాట్‌ పక్కనుండే అడ్డం మూడు చుక్కల మెనూను క్లిక్‌ చేసి ‘పిన్‌ కన్వర్జేషన్‌’ను ఎంచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని