క్లౌడ్‌ బ్యాకప్‌ లేకున్నా వాట్సప్‌ ఛాట్‌ బదిలీ!

క్లౌడ్‌ బ్యాకప్‌తో పనిలేకుండా ఒక పరికరం నుంచి మరో పరికరంలోకి ఛాట్స్‌ను బదిలీ చేసుకోవటానికి వాట్సప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. కొత్త ఫోన్‌ కొన్నప్పుడు విలువైన ఛాట్స్‌ను కోల్పోతామని భయపడేవారికిది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Updated : 27 Jul 2023 14:36 IST

క్లౌడ్‌ బ్యాకప్‌తో పనిలేకుండా ఒక పరికరం నుంచి మరో పరికరంలోకి ఛాట్స్‌ను బదిలీ చేసుకోవటానికి వాట్సప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. కొత్త ఫోన్‌ కొన్నప్పుడు విలువైన ఛాట్స్‌ను కోల్పోతామని భయపడేవారికిది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి దీన్ని వాడుకోవటమెలా?

* ముందుగా రెండు పరికరాలూ వై-ఫైతో అనుసంధానమై ఉండాలి. అవి ఒకదానికి మరోటి దగ్గరగానూ పెట్టాలి.

* సిమ్‌ కార్డుతో కూడిన పాత పరికరంలో వాట్సప్‌ సెటింగ్స్‌ ఓపెన్‌ చేయాలి.

* ఛాట్స్‌ ఆప్షన్‌ను తాకి, మెనూలో కిందికి వెళ్తే ‘ట్రాన్స్‌ఫర్‌ ఛాట్స్‌’ కనిపిస్తుంది.

* ట్రాన్స్‌ఫర్‌ ఛాట్స్‌ మీద క్లిక్‌ చేసి, ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు ఛాట్‌ బదిలీ ప్రక్రియను ఆరంభించాలి.

* కొత్త ఫోన్‌లో వాట్సప్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. పాత ఫోన్‌ నంబరుతో రిజిస్టర్‌ చేసుకోవాలి. పాత ఫోన్‌కు అందే ఓటీపీతో ధ్రువీకరించుకోవటం తప్పనిసరి.

* కొత్త ఫోన్‌లో అకౌంట్‌ మార్పిడి కోసం క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది. పాత ఫోన్‌ కెమెరాతో వాట్సప్‌ ద్వారా ఈ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. అప్పుడు ఛాట్‌ బదిలీ ప్రక్రియ మొదలవుతుంది.

* రెండు ఫోన్లను దగ్గరగా ఉంచాలి. బదిలీ అవుతున్నప్పుడు రెండు ఫోన్లను అన్‌లాక్‌ చేసి ఉంచాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు వేరే యాప్‌లతో పనులేవీ చేయొద్దు.

* ఛాట్‌ బదిలీ కావటానికి సుమారు అరగంట పడుతుంది. ఇది వై-ఫై వేగం మీద ఆధారపడి ఉంటుంది. బదిలీ పూర్తయ్యాక మెసేజ్‌ బాక్స్‌కు సమాచారం అందుతుంది. పాత ఫోన్‌లోని వాట్సప్‌ ఛాట్స్‌ కొత్త ఫోన్‌లో కనిపిస్తాయి. అదే ఖాతాతో పనిచేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్లకే అందుబాటులో ఉందని గుర్తించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు