నవ ఫీచర్ల వాట్సప్‌

నిత్య నూతన ఫీచర్లతో ఆకట్టుకునే వాట్సప్‌ ఈ సంవత్సరమూ అంతే దూకుడును ప్రదర్శిస్తోంది. మొబైల్‌, వెబ్‌ వర్షన్లలో యూజర్‌ ఇంటరాక్షన్‌ను మెరుగు పరచటానికి బోలెడన్ని కొత్త ఫీచర్లను సిద్ధం చేస్తోంది. కొత్త సైడ్‌బార్‌తో పాటు డార్క్‌మోడ్‌ను తీర్చిదిద్దటం, వెబ్‌ క్లయింట్‌ నుంచి నేరుగా యూజర్‌నేమ్‌ను సృష్టించటం వంటి వాటికి అవకాశం కల్పించనుంది.

Published : 03 Jan 2024 00:08 IST

నిత్య నూతన ఫీచర్లతో ఆకట్టుకునే వాట్సప్‌ ఈ సంవత్సరమూ అంతే దూకుడును ప్రదర్శిస్తోంది. మొబైల్‌, వెబ్‌ వర్షన్లలో యూజర్‌ ఇంటరాక్షన్‌ను మెరుగు పరచటానికి బోలెడన్ని కొత్త ఫీచర్లను సిద్ధం చేస్తోంది. కొత్త సైడ్‌బార్‌తో పాటు డార్క్‌మోడ్‌ను తీర్చిదిద్దటం, వెబ్‌ క్లయింట్‌ నుంచి నేరుగా యూజర్‌నేమ్‌ను సృష్టించటం వంటి వాటికి అవకాశం కల్పించనుంది. యూజర్‌నేమ్‌ను సృష్టించుకుంటే ఫోన్‌ నంబరును షేర్‌ చేయాల్సిన అవసరముండదు. ఇది గోప్యతను ఇంకాస్త పెంచుతుంది. ఈ యూజర్‌నేమ్‌ను ఎప్పుడైనా సవరించుకోవచ్చు. అప్‌డేట్‌ చేసిన వాట్సప్‌ వెబ్‌ ఇంటర్ఫేస్‌లో కమ్యూనిటీస్‌, స్టేటస్‌, ఛానెల్స్‌, న్యూఛాట్‌ బటన్లు విండోకు ఎడమ వైపులో పైభాగాన కనిపిస్తాయి. ఒక ట్యాబ్‌ నుంచి మరోదానికి తేలికగా మారటానికిది వీలు కల్పిస్తుంది. కొత్త డార్క్‌మోడ్‌ దగ్గరికి వస్తే.. డార్క్‌థీమ్‌కు అనుగుణంగా నేపథ్య రంగును సరిచేశారు. దీంతో కళ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది. ఈ ఫీచర్లు ప్రస్తుతం ఎంపిక చేసిన కొందరికే అందుబాటులోకి వచ్చాయి. త్వరలో అందరికీ అందుబాటులోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని