Microsoft OS Update: హై-రిస్క్‌ బగ్‌ ఉంది.. ఓఎస్‌ అప్‌డేట్‌ చేసుకోండి!

మైక్రోసాఫ్ట్ యూజర్లకు కేంద్ర కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మైక్రోసాఫ్ట్‌ సర్వీసులు, ఉత్పత్తుల్లో లోపాలున్నట్లు గుర్తించామని తెలిపింది. 

Published : 18 Sep 2022 20:05 IST

 మైక్రోసాఫ్ట్‌ యూజర్లకు కేంద్రం హెచ్చరిక! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: మైక్రోసాఫ్ట్ యూజర్లకు కేంద్ర కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మైక్రోసాఫ్ట్‌ సర్వీసులు, ఉత్పత్తుల్లో లోపాలున్నట్లు గుర్తించామని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సైబర్‌ దాడులను అరికట్టేందుకు కృషి చేసే కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-In) తెలిపింది. మైక్రోసాఫ్ట్‌ సర్వీసులు, ఉత్పత్తులలోని హై-రిస్క్‌ బగ్‌ కారణంగా వాటికి సంబంధించిన ఆర్బిటరీ కోడ్‌ను సైబర్‌ నేరగాళ్లు సులువుగా హ్యాక్‌ చేసి సెక్యూరిటీ సిస్టమ్‌ను ఏమార్చి యూజర్ డేటా సేకరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే మైక్రోసాఫ్ట్‌ సెక్యూరిటీ రెస్పాన్స్‌ సెంటర్‌ (MSRC) విడుదల చేసిన మైక్రోసాఫ్ట్‌ 2022 సెక్యూరిటీ అప్‌డేట్‌లను తమ సర్వీసుల్లో అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. 

మైక్రోసాఫ్ట్ విండోస్‌, మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌, మైక్రోసాఫ్ట్ షేర్‌ పాయింట్, మైక్రోసాఫ్ట్‌ డైనమిక్స్‌ సీఆర్‌ఎమ్‌, విజువల్ స్టూడియో, డాట్‌నెట్ ఫ్రేమ్‌ వర్క్‌ సర్వీసులు ఈ జాబితాలో ఉన్నాయని సెర్ట్‌ఇన్‌ తన రిపోర్ట్‌లో పేర్కొంది. పైన పేర్కొన్న జాబితాలోని సర్వీసులను ఉపయోగిస్తున్న యూజర్లు సెర్ట్‌ఇన్‌ రిపోర్ట్‌లోని సీవీఈ (CVE) ఆధారంగా ఎమ్‌ఎస్‌ఆర్‌సీ విడుదల చేసిన సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చు. సీవీఈ జాబితా కోసం క్లిక్ చేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని