Azadi Ka Amrit Mahotsav: వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్ డీపీలు మార్చాలా.. ఇలా చేయండి!
ఇంటర్నెట్ డెస్క్: భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (Azadi ka Amrut Mahotsav) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దేశ ప్రజలంతా ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేయాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. అలాగే ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో (Social Media) తమ ప్రొఫైల్ పిక్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని కోరారు.
ఆగస్టు 2న జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి. ఆయనకు నివాళిగా ఆగస్టు 2 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని పిలుపుతో చాలా మంది సోషల్ మీడియా యూజర్లు తమ ఖాతాల ప్రొఫైల్ పిక్/డీపీలను మార్చుకుంటున్నారు. వాట్సాప్‌లో ఎలా మార్చుకోవాలనేది చాలా మంది అవగాహన ఉండే ఉంటుంది. మరి మిగిలిన వాటి సంగతి ఏంటి?సోషల్ మీడియాలన్నింటిలో సెట్టింట్స్ ఒకేలా ఉండవు కదా..! అందుకే సామాజిక మాధ్యమ ఖాతాల్లో ప్రొఫైల్ పిక్/ డీపీ ఎలా మార్చుకోవాలో చూద్దాం...
ఫేస్‌బుక్ (Facebook)
- ఫేస్‌బుక్ ఖాతాలోకి లాగిన్ తరువాత ప్రొఫైల్ పిక్/డీపీపై కనిపించే కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఫేస్‌బుక్ ఖాతాలో అప్‌లోడ్ చేసిన ఫొటోలను చూపిస్తుంది.
- వాటిని నుంచి మీకు కావాల్సిన ఫొటోను సెలెక్ట్ చేసి ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవవచ్చు. ఫేస్‌బుక్ గ్యాలరీ నుంచి కాకుండా కొత్త ఫొటోను డీపీగా పెట్టుకోవాలనుకుంటే అప్‌లోడ్ ఫొటో ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత మీ ఫోన్ లేదా డెస్క్‌టాప్/పీసీలోని ఫొటోలను చూపిస్తుంది. వాటిలో మీకు నచ్చిన ఫొటోను సెలెక్ట్ చేసి సేవ్ చేసుకుంటే ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్/డీపీ మారిపోతుంది.
- ఒకవేళ టైమ్‌లైన్ ఫొటో మార్చుకోవాలనుకున్నా పైన పేర్కొన్న పద్ధతిని అనుసరించి ఛేంజ్ చేసుకోవచ్చు.
ట్విటర్ (Twitter)
- ట్విటర్‌లో ఎడమవైపు కనిపిస్తున్న మెనూలో ప్రొఫైల్ ఓపెన్ చేసి ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అందులో మీకు ప్రొఫైల్ పిక్/డీపీ, టైమ్‌లైన్ ఫొటోలపై కెమెరా ఐకాన్ కనిపిస్తుంది. మీరు ఏ ఫొటో మార్చుకోవాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేసి ఫోన్ గ్యాలరీ లేదా డెస్క్‌టాప్/పీసీ నుంచి ఫొటో సెలక్ట్ చేసుకోవాలి.
- తర్వాత కుడివైపు పైన ఉన్న అప్లై ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ప్రొఫైల్ పిక్/డీపీ మారిపోతుంది. టైమ్‌లైన్ ఫొటోను కూడా ఇదే తరహాలో మార్చుకోవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్ (Instagram)
- ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత యాప్‌లో కింద కుడివైపు ప్రొఫైల్ ఫొటో/డీపీ ఉంటుంది.
- దానిపై క్లిక్ చేసి ఎడిట్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఛేంజ్ ప్రొఫైల్ ఫొటో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ప్రొఫైల్ ఫొటో/డీపీపై క్లిక్ చేయగానే న్యూ ప్రొఫైల్ ఫొటో, ఇంపోర్ట్ ఫ్రమ్ ఫేస్‌బుక్ ఆప్షన్లు కనిపిస్తాయి.
- న్యూ ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేస్తే ఫోన్ గ్యాలరీ లేదా డెస్క్‌టాప్/డీసీ నుంచి ఫొటోను సెలెక్ట్ చేసి సేవ్ చేయాలి.
- ఒకవేళ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన ఫొటోలు కావాలనుకుంటే ఇంపోర్ట్ ఫ్రమ్ ఫేస్‌బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేసి అక్కడి గ్యాలరీలోని ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్/డీపీగా పెట్టుకోవచ్చు.
- ఇన్‌స్టాగ్రామ్ డెస్క్‌టాప్/పీసీ వెర్షన్‌లో పర్సన్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రొఫైల్ ఫొటో సెలెక్ట్ చేసి మార్చుకోవచ్చు.
లింక్డ్‌ఇన్ (Linkedin)
- లాగిన్ తర్వాత ప్రొఫైల్‌పై క్లిక్ చేస్తే ఎడిట్ ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది. అందులో ప్రొఫైల్ పొటోపై క్లిక్ చేస్తే యాడ్ ప్రొఫైల్ ఫొటో, వీడియో, ఫ్రేమ్ ఆప్షన్లు కనిపిస్తాయి.
- వాటిలో ప్రొఫైల్ ఫొటో ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫోన్ గ్యాలరీ లేదా డెస్క్‌టాప్/పీసీ వెర్షన్ నుంచి కావాల్సిన ఫొటోను సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే ప్రొఫైల్ ఫొటో/డీపీ మారిపోతుంది.
వాట్సాప్ (WhatsApp)
- యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళితే ప్రొఫైల్ ఫొటో/డీపీ కనిపిస్తుంది. దానిపైన ఉన్న కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేస్తే కెమెరా, గ్యాలరీ ఆప్షన్లు చూపిస్తుంది.
- ఫోన్ మెమొరీ నుంచి అప్‌లోడ్ చేయాలనుకుంటే గ్యాలరీపై క్లిక్ చేసి అందులోని ఫొటోను సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఫొటో తీసుకోవాలనుకుంటే కెమెరా ఆప్షన్‌పై క్లిక్ చేసి ప్రొఫైల్ ఫొటో/డీపీని మార్చుకోవచ్చు.
- డెస్క్‌టాప్ వెర్షన్‌లో ప్రొఫైల్ ఫొటో/డీపీపై క్లిక్ చేస్తే కెమెరా సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి డెస్క్‌టాప్/పీసీ నుంచి నచ్చిన ఫొటోను సెలెక్ట్ చేసుకుని డీపీగా పెట్టుకోవచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rishabh Pant: రిషభ్ పంత్‌కు కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ నటి..
-
India News
Smoking in Plane: సిగరెట్ కాల్చింది డమ్మీ విమానంలోనట.. బాబీ కటారియా వింత వాదన
-
Politics News
Nitish Kumar: ‘నాకు ఆ ఆలోచన లేదు’: చేతులు జోడించి మరీ స్పష్టం చేసిన నీతీశ్
-
Movies News
Macherla Niyojakavargam Review: రివ్యూ: మాచర్ల నియోజకవర్గం
-
General News
Vijayawada: కృష్ణా నదికి పోటెత్తిన వరద.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత
-
Politics News
Bandi Sanjay: డ్వాక్రా గ్రూపులను తెరాస నిర్వీర్యం చేసింది: బండి సంజయ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్‌లో నల్లగా మారిపోయిన ఇసుక..
- Hyderabad News: నాన్నను బతికించుకొనేందుకు ఆస్తులమ్మి.. షేర్లలో పెట్టి ఆత్మహత్య
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- AP Govt: మరో బాదుడు
- Dilraju: ‘దిల్ రాజు గారూ’ మా బాధ వినండి.. 36వేల ట్వీట్స్..!
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!