Infinix: 4000mAh బ్యాటరీ 10 నిమిషాల్లో ఫుల్ 

రోజు రోజుకి ఫోన్‌ వినియోగించే వారి సంఖ్య పెరిగిపోతుండటంతో సరికొత్త ఫీచర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి మొబైల్ తయారీ కంపెనీలు. ఇందులో భాగంగానే కెమెరా, బ్యాటరీ, ర్యామ్, స్టోరేజ్‌, డిస్‌ప్లే వంటి వాటిపై దృష్టి సారించాయి. తాజాగా ఇన్ఫీనిక్స్‌ సంస్థ తీసుకొస్తున్న కాన్సెప్ట్ ఫోన్ ఛార్జింగ్ టెక్నాలజీ టెక్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Updated : 30 Jun 2021 09:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రోజు రోజుకి ఫోన్‌ వినియోగించే వారి సంఖ్య పెరిగిపోతుండటంతో సరికొత్త ఫీచర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి మొబైల్ తయారీ కంపెనీలు. ఇందులో భాగంగానే కెమెరా, బ్యాటరీ, ర్యామ్, స్టోరేజ్‌, డిస్‌ప్లే వంటి వాటిపై దృష్టి సారించాయి. తాజాగా ఇన్ఫీనిక్స్‌ సంస్థ తీసుకొస్తున్న కాన్సెప్ట్ ఫోన్ ఛార్జింగ్ టెక్నాలజీ టెక్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో కేవలం 10 నిమిషాల వ్యవధిలో 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ 100 శాతం ఛార్జ్‌ అవుతుందని ఇన్ఫీనిక్స్‌ తెలిపింది. 160 వాట్ అల్ట్రా ఫ్లాష్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీతో ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. ఫాస్ట్‌ ఛార్జింగ్ కోసం ఇన్ఫీనిక్స్ సంస్థ సూపర్‌ ఛార్జ్‌ పంప్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ఇది యూఎస్‌బీ-సీ పోర్ట్‌ నుంచి వస్తున్న వోల్టేజ్‌లో మార్పులు చేసి వేగంగా ఛార్జ్‌ అయ్యేలా పవర్‌ను బ్యాటరీకి పంపిస్తుందని ఇన్ఫీనిక్స్‌ వెల్లడించింది. 

ఈ కాన్సెప్ట్‌ ఫోన్‌లో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుందని సమాచారం. వెనకవైపు మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ఈ ఫోన్‌ 50 వాట్ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న ఈ ఫోన్‌ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఇన్ఫీనిక్స్‌ తెలిపింది. ఇప్పటికే షావోమి, రియల్‌మీ వంటి కంపెనీలు 120 వాట్, 125 వైర్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇదే తరహాలో ఒప్పో, షావోమి కంపెనీలు 100 వాట్ వైర్‌లెస్‌ ఫాస్ట్ చార్జింగ్‌ టెక్నాలజీని తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. త్వరలోనే వీటిని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని