ఇన్‌స్టాగ్రాంలో టిక్‌టాక్‌ తరహా ఫీచర్..

ఫొటో షేరింగ్ యాప్‌ ఇన్‌స్టాగ్రాం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ల‌ను అందుబాటులోకి తీసుకొస్తూ తన వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కొద్దిరోజుల కిందట రీసెంట్లీ డిలీటెడ్ ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌స్టా స్టోరీల సంబంధించి కొత్త తరహా లుక్‌ను...

Updated : 05 Feb 2021 23:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫొటో షేరింగ్ యాప్‌ ఇన్‌స్టాగ్రాం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ల‌ను అందుబాటులోకి తీసుకొస్తూ తన వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కొద్దిరోజుల కిందట రీసెంట్లీ డిలీటెడ్ ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌స్టా స్టోరీల సంబంధించి కొత్త తరహా లుక్‌ను తీసుకురానుంది. ఇందులో భాగంగా టిక్‌టాక్‌ తరహాలో ఇన్‌స్టా స్టోరీలలోని వీడియోలను నిలువుగా పై నుంచి కిందకి జరిపేలా మార్పులు చేయనుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను పలువురు ఇన్‌స్టా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చి పరీక్షించారట. దీనికి సంబంధించిన స్ర్కీన్‌ షాట్‌ని అలెశాండ్రో పలుజీ డెవలపర్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశారు.

ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే రీల్స్‌ తరహాలోనే స్టోరీలు కూడా కనిపిస్తాయి. దీని ద్వారా వినియోగదారులు సరికొత్త అనుభూతి పొందుతారని ఇన్‌స్టాగ్రాం భావిస్తోంది. ప్రస్తుతం ఇన్‌స్టా స్టోరీలను చూసేందుకు స్క్రీన్‌ కుడి, ఎడమకు జరుపుకోవాలి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ని ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనే దానిపై పూర్తి సమాచారం లేదు. భారత్‌లో టిక్‌టాక్‌ నిషేధం తర్వాత ప్రత్యామ్నాయంగా ఇన్‌స్టాగ్రాం రీల్స్‌, యూట్యూబ్ షార్ట్స్‌ను తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు టిక్ టాక్‌‌ తరహా ఫీచర్లను పరిచయం చేస్తున్నారు.

ఇవీ చదవండి..

ఇన్‌స్టాగ్రాం కొత్త ఫీచర్..డిలీట్ చేసినా వెనక్కి

FBలో కొత్త ఫీచర్స్‌..లైక్‌ బటన్ ఉండదు‌..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని