iPhone: వైఫై సమస్య..ఇలా సరిచేసుకోండి 

మనం ఎప్పుడైనా షాపింగ్‌మాల్‌, రెస్టారెంట్ లేదా మెట్రో స్టేషన్ వంటి చోట్లకి వెళ్లినప్పుడు డేటా సేవ్‌ అవుతుందని అక్కడ ఉచితంగా లభించే  వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంటాం. అయితే కొన్ని పబ్లిక్‌ నెట్‌వర్క్‌లలోని లోపాల కారణంగా మన ఫోన్‌లోని వైఫై ఫీచర్‌లో సమస్యలు రావచ్చంటున్నారు టెక్ నిపుణులు....

Published : 06 Jul 2021 23:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మనం ఎప్పుడైనా షాపింగ్‌మాల్‌, రెస్టారెంట్ లేదా మెట్రో స్టేషన్ వంటి చోట్లకి వెళ్లినప్పుడు డేటా సేవ్‌ అవుతుందని అక్కడ ఉచితంగా లభించే  వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంటాం. అయితే కొన్ని పబ్లిక్‌ నెట్‌వర్క్‌లలోని లోపాల కారణంగా మన ఫోన్‌లోని వైఫై ఫీచర్‌లో సమస్యలు రావచ్చంటున్నారు టెక్ నిపుణులు. తాజాగా %secretclub%power అనే పబ్లిక్ నెట్‌వర్క్‌ కారణంగా ఐఫోన్‌ వైఫై ఫీచర్‌ ఆటోమేటిగ్గా డిసేబుల్ అవుతుందట. ఇదే విషయాన్ని కార్ల్‌ షౌ అనే రివర్స్‌ ఇంజినీర్ తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఇతర పబ్లిక్ నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అయినప్పుడు కూడా తాము ఈ సమస్యను ఎదుర్కొన్నామని పలువురు యూజర్స్ సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. ఈ లోపాన్ని సరిచేసుకోవాలంటే ఐట్యూన్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీ ఖాతాను రీస్టోర్‌ చేయడం లేదా మీ నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ రీసెట్‌ చేయమని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మీ ఐఫోన్‌లో వైఫై తిరిగి మునుపటిలా పనిచేస్తుందని తెలిపారు. అయితే ఐట్యూన్స్‌లో ఖాతా రీస్టోర్ చేసేముందు బ్యాక్‌అప్‌ తీసుకోవడం మంచిది. కొన్నిసార్లు రీస్టోర్ సమయంలో మీ డేటా డిలీట్ అయ్యే అవకాశం ఉంది. 

ఛార్జింగ్ సమస్యకు చెక్‌

ఐఫోన్ యూజర్స్‌ నుంచి తరచుగా వినిపించే ఫిర్యాదు బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండటంలేదని. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్‌లో ఛార్జింగ్ చాలా తక్కువ సమయం ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు యాపిల్ కంపెనీ సరికొత్త టెక్నాలజీని పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో విడుదలకానున్న ఐఫోన్ 13 మోడల్‌లో పెద్ద ఛార్జింగ్ కాయిల్‌ను ఇస్తున్నారట. దీని వల్ల బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండటంతోపాటు ఫోన్‌ వేడెక్కుండా, బ్యాటరీ వేగంగా ఛార్జ్‌ అవుతుందని సమాచారం. అలానే ఇది రివర్స్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుందట. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని