OnePlus: వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఇక నుంచి 4 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్!
ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ విషయంలో వన్‌ప్లస్ కీలక ప్రకటన చేసింది. ఇకపై నాలుగు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల విషయంలో యాపిల్‌తో పోలిస్తే ఆండ్రాయిడ్‌ది (Android) కాస్త వెనుకబాటే. ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ ఫోన్లకు రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తుంటాయి. దీనివల్ల ఫోన్ అన్ని విధాలా ఫోన్ బాగున్నా.. అప్‌డేట్స్ రాకపోవడం వల్ల చాలా మంది యూజర్లు తమ ఫోన్లను పక్కన పెట్టేస్తుంటారు. ప్రస్తుతం శాంసంగ్ ఒక్కటే నాలుగేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌ను ఇస్తోంది. ఇప్పుడు వన్‌ప్లస్ కూడా ఈ జబితాలో వచ్చి చేరింది.
వచ్చే ఏడాది (2023) నుంచి ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లకు నాలుగేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు వన్‌ప్లస్ ప్రకటించింది. ఆక్సిజన్ ఓఎస్ పేరిట నాలుగు అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఉదాహరణకు త్వరలో రాబోయే వన్‌ప్లస్ 11 సిరీస్ తీసుకుంటే.. ఇందులో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఉంటుంది. వన్‌ప్లస్ తాజా హామీ ప్రకారం ఆండ్రాయిడ్ 17 వరకు ఆ కంపెనీ అప్‌డేట్స్ ఇస్తుంది. అయితే, ఏ ఫోన్లకు ఈ అప్‌డేట్స్ ఇచ్చేదీ మాత్రం కంపెనీ వెల్లడించలేదు. కేవలం ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు మాత్రమే ఇస్తారా? లేదంటే ఎంట్రీ లెవల్ నార్డ్ సిరీస్ ఫోన్లకూ ఇస్తారా? అనేది తెలియరాలేదు. అలాగే ప్రస్తుతం ఉన్న ఫోన్లకూ ఇది వర్తిస్తుందా? లేదంటే కొత్తగా రాబోయే ఫోన్లకు మాత్రమేనా అనేదానిపై స్పష్టత లేదు. ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు మాత్రమే దీన్ని పరిమితం చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Donald Trump: నేను మళ్లీ అధికారంలోకి వస్తే.. ఆ హక్కు ఉండదు: ట్రంప్
-
Politics News
MLC Kavitha: బ్రిజ్ భూషణ్‌పై చర్యలేవీ?: కేంద్రాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ కవిత
-
India News
Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆధారాలు లభించలేదు..!
-
Politics News
BJP: ‘మోదీ.. ది బాస్’ అంటే రాహుల్ జీర్ణించుకోవట్లేదు: భాజపా కౌంటర్
-
General News
Bopparaju: నాలుగో దశ ఉద్యమం మా చేతుల్లో ఉండదు: బొప్పరాజు
-
Movies News
Ugram OTT Release: ఓటీటీలోకి నరేశ్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?