Oxygen 13: ఆక్సిజన్‌ఓఎస్‌ 13లో కొత్తగా ఏమేం రాబోతున్నాయంటే?

వన్‌ప్లస్ కొత్త వెర్షన్‌ ఆక్సిజన్ ఓఎస్‌ను తీసుకురానుంది. ఆక్సిజన్‌ఓఎస్‌ 13 (OxygenOS 13)గా తీసుకొస్తున్న ఓఎస్‌లో యూజర్లకు ఎలాంటి ఫీచర్లు పరిచయం కానున్నాయో చూద్దాం...

Updated : 05 Aug 2022 11:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వన్‌ప్లస్ (OnePlus) కొత్త వెర్షన్‌ ఆక్సిజన్ ఓఎస్‌ను తీసుకురానుంది. ఆక్సిజన్‌ఓఎస్‌ 13 (OxygenOS 13)గా తీసుకొస్తున్న ఓఎస్‌లో క్యారెక్టర్‌స్టిక్స్, ప్రొడక్టివిటీ, కనెక్టివిటీ, సేఫ్టీలకు ప్రాధాన్యమిస్తోంది. ముందుగా ఈ వెర్షన్‌ను వన్‌ప్లస్‌ 10 ప్రో (OnePlus 10 Pro) మోడల్‌లో పరిచయం చేయనున్నట్లు సమాచారం. తర్వాత కొత్తగా విడుదలైన వన్‌ప్లస్‌ 10టీ (OnePlus 10T) మోడల్‌లో తీసుకురానున్నారు. ఆక్వామార్ఫిక్‌ డిజైన్‌ (Aquamorphic Design) స్ఫూర్తితో ఆక్సిజన్‌ఓఎస్‌ 13ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ చెబుతోంది. మరి ఈ ఓఎస్‌లో యూజర్లకు ఎలాంటి ఫీచర్లు పరిచయం కానున్నాయో చూద్దాం..

  • యూజర్‌ డేటా భద్రత కోసం ప్రైవేట్‌ సేఫ్ 2.0 పేరుతో సేఫ్టీ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ఇందులో డేటాతోపాటు, డాక్యుమెంట్స్‌, మీడియా ఫైల్స్‌ను వర్చువల్‌ సేఫ్‌లో పెట్టుకోవచ్చు. దీనివల్ల ఇతరులెవరూ వీటిని యాక్సెస్ చేయలేరని వన్‌ప్లస్‌ చెబుతోంది.  
  • యాప్‌ మెనూ ఓపెన్‌ చేయకుండా ముఖ్యమైన యాప్స్‌ను సులువుగా యాక్సెస్ చేసుకునేందుకు వీలుగా సైడ్‌బార్‌ ఫీచర్‌ ఉంది. హోం స్క్రీన్‌పైనే సైడ్‌లో బార్‌ ప్లేస్‌ చేసకుని అందులో కావాల్సిన యాప్స్‌ను పెట్టుకోవచ్చు. 
  • ఇయర్‌బడ్స్‌, ఇయర్‌ఫోన్స్ వినియోగం పెరిగిన నేపథ్యంలో వన్‌ప్లస్‌ కొత్తగా స్పేషియల్‌ ఆడియో, డాల్బీ అట్‌మోస్‌ సపోర్ట్‌, ఆడియో స్విచ్‌ ఫీచర్లను తీసుకొస్తోంది. వీటితో యూజర్లు మెరుగైన ఆడియోను ఆస్వాదించగలుగుతారు. 

  • కొత్త వ్యూయర్‌షిప్‌ కోసం సాఫ్ట్‌, రౌండ్‌ ఎడ్జెస్‌తో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లో వన్‌ప్లస్‌ మార్పులు చేసింది. యాప్స్‌ను వేగంగా యాక్సెస్ చేసేందుకు వీలుగా ఐకాన్‌ సైజ్‌ను పెంచింది. 
  • మెసేజింగ్‌లో ఆర్‌సీఎస్‌ (రిచ్‌ కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌)ను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనివల్ల యూజర్లు మెసేజింగ్‌తోపాటు మీడియాఫైల్స్‌ను కూడా షేర్ చేయొచ్చు. ఫొటో, వీడియో, డాక్యుమెంట్‌ షేరింగ్‌ కోసం నియర్‌బై ఫీచర్‌ను ఆక్సిజన్‌ఓఎస్‌ 13 అప్‌డేట్‌లో పరిచయం చేస్తోంది. 
  • గేమింగ్‌ కోసం హైపర్‌ బూస్టర్‌ ఫీచర్లను తీసుకొస్తోంది. హైపర్‌ బూస్టర్‌తో యూజర్స్‌ గేమింగ్‌లో గ్రాఫిక్స్‌, సౌండ్‌ పరంగా మెరుగ్గా ఉంటుందని వన్‌ప్లస్‌ చెబుతోంది. జెన్‌ మోడ్‌లో కొత్తగా ఐదు థీమ్‌లను పరిచయం చేస్తోంది. వన్‌ప్లస్‌ 8 సిరీస్‌, 9 సిరీస్‌, 10 సిరీస్‌తోపాటు నార్డ్‌ సిరీస్‌ ఫోన్లలో ఈ ఓఎస్‌ అందుబాటులోకి రానుంది. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని