ఒప్పో నుంచి మరో 5జీ ఫోన్‌

దేశంలో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానప్పటికీ 5జీ సపోర్ట్‌ చేసే ఫోన్లు మాత్రం మార్కెట్లోకి క్యూ కడుతున్నాయి. గతేడాదే తొలి 5జీ ఫోన్‌ తీసుకొచ్చిన ఒప్పో.. తాజాగా భారత మార్కెట్లోకి మరో ఫోన్‌ను విడుదల...........

Published : 18 Jan 2021 16:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానప్పటికీ 5జీ సపోర్ట్‌ చేసే ఫోన్లు మాత్రం మార్కెట్లోకి క్యూ కడుతున్నాయి. గతేడాదే తొలి 5జీ ఫోన్‌ తీసుకొచ్చిన ఒప్పో.. తాజాగా భారత మార్కెట్లోకి మరో ఫోన్‌ను విడుదల చేసింది. గతేడాది రెనో సిరీస్‌లో తీసుకొచ్చిన 4ప్రో కు కొనసాగింపుగా రెనో 5 ప్రో 5జీని సోమవారం లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ 8జీబీ/ 128జీబీ వేరియంట్‌ ధరను కంపెనీ రూ.35,990గా నిర్ణయించింది. జనవరి 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో ఇండియా ఈ-స్టోర్‌తో పాటు ఇతర ప్రముఖ రిటైల్‌ స్టోర్లలో లభ్యం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులపై 10 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌ బ్యాంక్‌ కార్డులపై రూ.2,500 మేర క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. పేటీఎం ద్వారా కొనుగోలుపైనా డిస్కౌంట్‌ లభిస్తుంది.

ఇక రెనో 5 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 11 కలర్‌ ఓఎఎస్‌ 11.1తో పనిచేస్తుంది. 6.55 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేని అందిస్తున్నారు. 90Hz స్క్రీన్‌ రీఫ్రెష్‌ రేట్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 1000+ ప్రాసెసర్‌ను వినియోగించారు. వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 8 ఎంపీ సెకండరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో షూటర్‌, 2 ఎంపీ మోనో క్రోమ్‌ సెన్సర్‌ను అమర్చారు. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరాను అందించారు. 8జీబీ/128జీబీ, 12జీబీ/256 జీబీ వేరియంట్లలో ఈ ఫోన్‌ లభిస్తోంది. యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 4,350 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు. 65W సూపర్‌ వూక్‌ 2.0 ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. దీంతోపాటు ఒప్పో ఎంకో ఎక్స్‌ పేరిట ట్రూలీ వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ను కూడా ఒప్పో తీసుకొచ్చింది. నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సదుపాయంతో వస్తున్న ఈ ఇయర్‌ బడ్స్‌ ధరను రూ.9,990గా కంపెనీ నిర్ణయించింది. జనవరి 22 నుంచే దీని అమ్మకాలూ ప్రారంభం కానున్నాయి.

ఇవీ చదవండి..
వెనక్కి తగ్గిన వాట్సాప్‌!

మీరు నడిస్తే... వీళ్లు డబ్బులిస్తారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని