Realme Pad X: రియల్‌మీ కొత్త ట్యాబ్‌.. ధర, ఫీచర్లివే!

రియల్‌మీ కంపెనీ మరో కొత్త ట్యాబ్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. రియల్‌మీ ప్యాడ్ ఎక్స్‌ పేరుతో పరిచయం చేయనున్న ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి.. ధరెంత.. విడుదల తేదీపై ఓ లుక్కేద్దాం... 

Updated : 24 Nov 2022 12:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రియల్‌మీ కంపెనీ మరో కొత్త ట్యాబ్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. రియల్‌మీ ప్యాడ్ ఎక్స్‌ పేరుతో పరిచయం చేయనుంది. రియల్‌మీ నుంచి వస్తోన్న మూడో ట్యాబ్‌ ఇది. ఇప్పటికే ప్యాడ్‌ మినీ, ప్యాడ్‌ పేరుతో రెండు ట్యాట్‌లను భారతీయ యూజర్లకు పరిచయం చేసింది. మరి రియల్‌మీ కొత్త ట్యాబ్‌ ప్యాడ్‌ ఎక్స్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి.. ధరెంత.. విడుదల తేదీపై ఓ లుక్కేద్దాం. 

ప్యాడ్‌ ఎక్స్‌ ఫీచర్లు

ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. 11 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌ ఉపయోగించారు. రియల్‌మీ ప్యాడ్‌ ఎక్స్‌లో వెనుకవైపు 13 ఎంపీ కెమెరా ఉంది. వీడియోకాల్స్‌, సెల్ఫీల కోసం ముందు భాగంలో 105-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 8 ఎంపీ కెమెరా అమర్చారు. డాల్బీ అట్‌మోస్, హై-రిజల్యూషన్‌ ఆడియోతో నాలుగు స్పీకర్లు ఇస్తున్నారు. 8,340 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రియల్‌మీ పాడ్‌ ఎక్స్‌ 6 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో భారత్‌లో లభించనుంది. జులై 26న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ధర ₹ 20 వేల నుంచి ₹ 25 వేల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని