2021 శాంసంగ్ తొలి ఫోన్..ధరెంతంటే..!

బడ్జెట్ ఫోన్‌ మార్కెట్‌ విస్తరణ లక్ష్యంగా శాంసంగ్ 2021లో గెలాక్సీ ఎం సిరీస్ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్‌ పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇతర కంపెనీల బడ్జెట్‌ మోడల్స్‌కి ధీటుగా తక్కువ ధరలో...

Published : 07 Jan 2021 19:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బడ్జెట్ ఫోన్‌ మార్కెట్‌ విస్తరణ లక్ష్యంగా శాంసంగ్ 2021లో గెలాక్సీ ఎం సిరీస్ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్‌ పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇతర కంపెనీల బడ్జెట్‌ మోడల్స్‌కి ధీటుగా తక్కువ ధరలో ట్రిపుల్ రియర్ కెమెరా, హెచ్‌డీ+ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ ఉన్నాయి. గతంలో విడుదల చేసిన గెలాక్సీ ఎం01ఎస్‌కి కొనసాగింపుగా శాంసంగ్ ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. మరి గెలాక్సీ ఎం02ఎస్‌ ధరెంత..ఇంకా ఏమేం ఫీచర్లు ఇస్తున్నారో చూద్దాం..

గెలాక్సీ ఎం02ఎస్‌ ఫీచర్లు

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత శాంసంగ్‌ వన్‌ఐయూఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.5-అంగుళాల హెచ్‌డీ+ వాటర్‌ డ్రాప్‌ నాచ్‌ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 5ఎంపీ కెమెరా అమర్చారు. ఇందులో ఐఎస్‌ఓ కంట్రోల్‌, ఆటో ఫ్లాష్‌, డిజిటల్ జూమ్‌, హెచ్‌డీఆర్‌ వంటి ఫీచర్లున్నాయి. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 3జీబీ ర్యామ్‌/32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ధర రూ. 8,999, 4జీబీ/64జీబీ వేరియంట్‌ ధర రూ. 9,999. బ్లాక్‌, బ్లూ, రెడ్ రంగుల్లో లభిస్తుంది. అమెజాన్‌, శాంసంగ్‌ వెబ్‌సైట్‌లతో పాటు అన్ని శాంసంగ్ స్టోర్లలో త్వరలోనే అమ్మకాలు ప్రారంభమవుతాయి.

ఇవీ చదవండి..

తక్కువ ధరకే 5జీ ఫోన్‌.. ఎప్పుడంటే..!

షావోమి కొత్త ఫోన్..ఎటు తిప్పినా డిస్‌ప్లేనే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని