Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
కోకాకోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. అయితే, కోకాకోలా ఈ ఫోన్‌ను బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా తీసుకొస్తుందా? లేక స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలోకి అడుగుపెట్టనుందా? అనే దానిపై స్పష్టతలేదు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ ( Smartphone) వినియోగం పెరుగుతుండటంతో మొబైల్ తయారీతో సంబంధంలేని కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. తాజాగా ప్రముఖ శీతల పానీయాల ఉత్పత్తి సంస్థ కోకాకోలా (Coca Cola) కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో పరిచయం చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలను భారత్‌కు చెందిన పాపులర్ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్వీట్ చేశారు. కోలా ఫోన్ (Cola Phone) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ కోసం కోకాకోలా ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీతో జట్టు కట్టిందని చెబుతూ ఫోన్‌కు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు. మార్చి నెలాఖరున కోలా ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఈ ఫోన్‌లో వెనుకవైపు రెండు కెమెరాలు ఇస్తున్నట్లు ఫొటోలో తెలుస్తోంది. ఫోన్ సైడ్‌లో వాల్యూమ్ కంట్రోల్ బటన్స్ కూడా ఉన్నాయి. కోలా ఫోన్ వెనుకవైపు చూసేందుకు రియల్‌మీ(Realme) ఫోన్‌ను పోలి ఉండటంతో.. కోకాకోలా రియల్‌మీ కంపెనీతో జట్టు కట్టిందని వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై రెండు సంస్థలు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, రియల్‌మీ 10 (Realme 10) సిరీస్ ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుందని సమాచారం. ప్రస్తుతం రియల్‌మీ 10 మోడల్‌లో 6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వంటి పీచర్లు ఉన్నాయి. కోకాకోలా ఈ ఫోన్‌ను కేవలం బ్రాండ్ ప్రమోషన్ కోసం తీసుకొస్తుందా? లేక స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలోకి అడుగుపెట్టనుందా? అనే దానిపై స్పష్టతలేదు.
మొబైల్ తయారీతో సంబంధంలేని వ్యాపార సంస్థలు ఫోన్ తయారీపై ఆసక్తి కనబరచడం ఇదే తొలిసారి కాదు. 2015లో మరో శీతల పానీయాల సంస్థ పెప్సీ (Pepsi) సైతం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. పెప్సీ పీ1 (Pepsi P1) పేరుతో షెన్‌జెన్ కూబే అనే సంస్థతో కలిసి పెప్సీ ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. తర్వాత ఈ ఫోన్ ఉత్పత్తిని నిలిపివేసింది. తర్వాత వన్‌ప్లస్ (OnePlus), ఒప్పో (Oppo) సంస్థలతో కలిసి మెక్‌లారెన్, అవెంజర్స్ ఎడిషన్స్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌లు విడుదలయ్యాయి. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) సైతం పై ఫోన్ (Pi Phone) పేరుతో కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Canada: కెనడాలో ఓ పెళ్లివేడుకలో పంజాబీ గ్యాంగ్‌స్టర్ హత్య..!
-
India News
Wrestlers Protest: రెజ్లర్ల ఫొటోలు మార్ఫింగ్.. మండిపడ్డ సాక్షి మలిక్
-
Crime News
Kurnool: భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య
-
Sports News
Dhoni - CSK: ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్’ ధోనీకి వర్తించదట.. కారణం చెప్పిన సెహ్వాగ్!
-
India News
IAF: వాయుసేన అపాచీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్