ఎంఐలో 888.. వన్‌ప్లస్‌ వెరైటీ.. భలే BeU

ఆ ప్రాసెసర్‌తో తొలిసారి.. ఎంఐ 11... మగువలకు ప్రత్యేక ఫోన్‌... యాప్‌తో రక్షణ వలయం.. రంగులు మార్చేస్తుంది.. బ్యాక్‌ ప్యానల్‌ అదుర్స్‌

Updated : 12 Aug 2022 12:26 IST

ఆ ప్రాసెసర్‌తో తొలిసారి.. ఎంఐ 11

పీసీ, ఫోన్‌ ఏదైనా దాని సామర్థ్యం ప్రాసెసర్‌పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఏదైనా గ్యాడ్జెట్‌ కొనే ముందు ఏ ప్రాసెసర్‌తో పని చేస్తుందని చెక్‌ చేస్తాం. అంతటి ప్రాధాన్యమున్న ప్రాసెసర్‌ని అప్‌డేట్‌ చేస్తూ షావోమి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని సిద్ధం చేసింది. పేరు ‘ఎంఐ 11’. స్నాప్‌డ్రాగన్‌ 888 చిప్‌సెట్‌ని తొలిసారి ఫోన్‌తో ప్రవేశపెట్టింది. పంచ్‌-హోల్‌ డిజైన్‌తో తెర కనిపిస్తుంది. అంచుల వరకూ హెచ్‌డీ తాకేతెరలోనే ‘ఇన్‌-డిస్‌ప్లే’ ఫింగర్ ‌ఫ్రింట్‌ రీడర్‌ని ఏర్పాటు చేశారు. సెన్సర్‌పై వేలుని ఉంచడం ద్వారా హార్ట్‌రేట్‌ని మానిటర్ కూడా‌ చేయొచ్చు. తెర పరిమాణం 6.81 అంగుళాలు. రిజల్యూషన్‌ 1440X3200 పిక్సల్స్‌. 12 జీబీ వరకూ ర్యామ్‌ సపోర్టు ఉంది. స్టోరేజ్‌ సామర్థ్యం 256 జీబీ. ఇక కెమెరాల విషయానికొస్తే.. వెనక మూడు కెమెరాల (108 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ టెలిఫోటో లెన్స్, 5 ఎంపీ మాక్రో కెమెరా) సెట్‌అప్‌ ఉంది. సెల్ఫీలకు 20 ఎంపీ కెమెరాని ఏర్పాటు చేశారు. 

* అంచనా ధర ₹45,000 (8 జీబీ, 128జీబీ), రూ.52,800 (12 జీబీ, 256 జీబీ)


మగువలకు ప్రత్యేక ఫోన్‌... యాప్‌తో రక్షణ వలయం

రకరకాల ఫోన్‌లు మార్కెట్‌లో చూస్తున్నాం. కానీ, ఎప్పుడైనా ఈ ఫోన్‌ ఆడవారికి ప్రత్యేకం అని ఎప్పుడైనా చూశారా? లావా ఇప్పుడు అలాంటి అందుబాటులోకి తెస్తోంది. అదీ బడ్జెట్‌ ధరలోనే! పేరేంటంటే.. BeU. దీంట్లో మహిళల భద్రత నిమిత్తం ప్రత్యేక బిల్ట్ ఇన్‌ యాప్‌ ‘వీసేఫ్‌’ యాప్‌ ఉంది. దీంతో మగువలు రక్షణ వ్యవస్థని క్రియేట్‌ చేసుకోవచ్చు. వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. ఒక్కసారి పుల్‌ ఛార్జ్‌ చేస్తే సుమారు 16 గంటల పాటు వాడుకోవచ్చు. వాటర్‌ డ్రాప్‌ నాచ్‌తో కనిపించే డిస్‌ప్లే పరిమాణం 6.088 అంగుళాలు. రిజల్యూషన్‌ 720X1560 పిక్సల్స్‌. ర్యామ్‌ 2 జీబీ. ఎక్స్‌టర్నల్‌ మెమొరీ 32 జీబీ. వెనక డ్యూయల్‌ కెమెరాలు (13 ఎంపీ, 2 ఎంపీ) ఉన్నాయి. ముందు సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఉంది. స్త్రీలు ఎక్కువగా ఇష్టపడే లేత గులాబీ రంగులో ఫోన్‌ ముస్తాబయ్యింది. బ్యాటరీ సామర్థ్యం 4,060 ఎంఏహెచ్‌.

* ధర ₹6,888


రంగులు మార్చేస్తుంది.. బ్యాక్‌ ప్యానల్‌ అదుర్స్‌

స్మార్ట్‌ ఫోన్‌ ఏదైనా.. ఫోన్‌ వెనక భాగంలో ఏముంటాయ్‌? కెమెరాల సెట్‌ అప్, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్లు, ఫోన్‌ పేరు, కంపెనీ లోగో కనిపిస్తాయ్‌. అది తెలిసిన విషయమే. కొత్తగా ఇంకా ఏం పెట్టొచ్చు అనే ఆలోచన వన్‌ ప్లస్‌కి వచ్చిందేమో! భిన్నమైన ఆలోచనతో ఓ కాన్సెప్ట్‌ ఫోన్‌ని టెక్నాలజీ ప్రియులకు పరిచయం చేసింది. అదే ‘వన్‌ప్లస్‌ 8టీ కాన్సెప్ట్‌’. దీంట్లో ఏంటా ప్రత్యేకత అంటే.. ఫోన్‌ వెనక రంగులు మారే ప్యానల్‌ కనిపిస్తుంది. రంగులు మారే ప్రత్యేక ఫిల్మ్‌తో బ్యాక్‌ ప్యానల్‌ని డిజైన్‌ చేశారు. నీలి రంగు నుంచి వెండి రంగులోకి మారడం ఈ ప్యానల్‌ ప్రత్యేకత.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని