Truecaller: ట్రూకాలర్‌ దూకుడు.. ఇకపై ప్రీలోడెడ్ యాప్‌గా!

ఇకమీదట కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ట్రూకాలర్ యాప్ ప్రీ-ఇన్‌స్టాల్‌ యాప్‌గా యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. 

Published : 07 Feb 2022 21:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాలర్ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌ కీలక ప్రకటన చేసింది. ఇక మీదట ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రీ-లోడెడ్ యాప్‌గా యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. యాప్‌ ప్రీ-ఇన్‌స్టాల్‌గా వచ్చినప్పటికీ దాన్ని ఉపయోగించాలా.. వద్దా అనేది యూజర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఇండియా, ఇండోనేషియా, మలేషియా, లాటిన్ అమెరికా మార్కెట్లలో సుమారు 100 మిలియన్‌ కొత్త ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో ప్రీ-లోడెడ్‌ యాప్‌గా ఇవ్వడం లక్ష్యం పెట్టుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. గతేడాదిలో ట్రూకాలర్ యూజర్లకు వీడియో కాలర్ ఐడీ, కాల్ రికార్డింగ్, ఘోస్ట్ కాల్, కాల్‌ అనౌన్స్ వంటి ఫీచర్లను పరిచయం చేసింది. 

‘‘ట్రూకాలర్ లేటెస్ట్ వెర్షన్ యాప్‌ ఇక మీదట విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్లలో ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ యాప్‌గా ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లకు ఈ యాప్‌ను చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ట్రూకాల్‌ సీఈవో, వ్యవస్థాపకుడు అలెన్‌ మామెది తెలిపారు. ప్రస్తుతం ట్రూకాలర్‌కు భారత్‌లో మొత్తంగా 450 మిలియన్ల మంది యూజర్లు ఉండగా, వారిలో 220 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు. రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ సంఖ్య 700 మిలియన్లకు చేరుతుందనే ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని