Twitter: కొత్త ఫీచర్‌.. ట్రోలింగ్ బంద్‌ అంతే!

స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగింది. సోషల్‌ మీడియా సంస్థలు కూడా యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో యూజర్స్‌కి మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ట్విటర్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గతంలో ట్వీట్ చేసే ముందు మన ట్వీట్‌కి ఎవరెవరు రిప్లై ఇవ్వాలనేది ఎంచుకునే అవకాశం ఉంది..

Published : 15 Jul 2021 23:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగింది. సోషల్‌ మీడియా సంస్థలు కూడా యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో యూజర్స్‌కి మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ట్విటర్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గతంలో ట్వీట్ చేసే ముందు మన ట్వీట్‌కి ఎవరెవరు రిప్లై ఇవ్వాలనేది ఎంచుకునే అవకాశం ఉంది. తాజాగా ట్వీట్ చేసిన తర్వాత కూడా ఎవరు రిప్లై ఇవ్వచ్చనేది నిర్ణయించుకోవచ్చు. ఈ ఫీచర్ కోసం యూజర్స్ తమ ఫోన్లలో ట్విటర్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. అంతేకాకుండా ఈ ఫీచర్ ద్వారా ట్వీట్‌లతో ఇతరులను ట్రోల్ చేసేవారిని అడ్డుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే వాయిస్‌ మెసేజ్‌, డైరెక్ట్‌ మెసేజ్‌, ఫ్లీట్ వంటి వాటితోపాటు స్పేసెస్‌ అనే కొత్త ఫీచర్ను‌ ట్విటర్ యూజర్స్‌కి పరిచయం చేసింది. పాపులర్ ఆడియో యాప్‌ క్లబ్‌హౌస్‌కి ప్రత్యామ్నాయంగా ట్విటర్ స్పేసెస్‌ ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని