వాట్సాప్‌లో ఈ సందేశాలు వచ్చాయా?

బహుశా ఇలాంటి సందేశం మీ వాట్సాప్‌ గ్రూప్‌లోనో, వ్యక్తిగతంగానో ఇప్పటికే వచ్చి ఉంటుంది. ఇదే కాదు ఓ యువతి మాట్లాడుతున్న......

Updated : 22 Jan 2021 14:31 IST

తుది నోటీసు: ‘‘విస్మరించవద్దు దయచేసి జాగ్రత్తగా చదవండి. హలో, నేను వరుణ్ పులియాని వాట్సాప్ డైరెక్టర్. ఈ సందేశం మా వినియోగదారులందరికీ మార్క్ జుకర్‌బర్గ్‌కు 19 బిలియన్ డాలర్లకు వాట్సాప్ అమ్మినట్లు తెలియజేయడం. వాట్సాప్ ఇప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ చేత నియంత్రించబడుతుంది. మీకు కనీసం 20 పరిచయాలు ఉంటే, ఈ వచన సందేశాన్ని పంపండి మరియు మీ వాట్సాప్ లోగో 24 గంటల్లో ఫేస్బుక్ యొక్క ‘ఎఫ్’తో కొత్త చిహ్నంగా మారుతుంది.’’

బహుశా ఇలాంటి సందేశం మీ వాట్సాప్‌ గ్రూప్‌లోనో, వ్యక్తిగతంగానో ఇప్పటికే వచ్చి ఉంటుంది. ఇదే కాదు ఓ యువతి మాట్లాడుతున్న ఆడియో కూడా వాట్సాప్‌ గ్రూపుల్లో కొద్దిరోజులుగా విపరీతంగా సర్య్కులేట్‌ అవుతోంది. ఈ రెండు సందేశాల అర్థం ఒకటే.. ఈ మెసేజ్‌ని మీకు తెలిసిన వారికి ఫార్వర్డ్‌ చేయండి అని చెప్పడం. గతంలోనూ ఇలాంటి సందేశాలు వచ్చినప్పటికీ.. వాట్సాప్‌ నూతన ప్రైవసీ పాలసీపై చర్చ జరుగుతున్న వేళ మళ్లీ ఇలాంటి ఫేక్‌ మెసేజులు ఊపందుకున్నాయి. ఇలాంటి సందేశాలు కింద వస్తున్న లింకులను క్లిక్‌ చేసి కొందరు సైబర్‌ నేరగాళ్ల బారిన పడుతున్నారు.

వాట్సాప్‌ రంగు మార్చుకోండంటూ వస్తున్న ఫేక్‌ లింక్స్‌లో ఇదొకటి...


 

మరి వాస్తవమెంత?

తొలుత ఈ వరుణ్‌ పులియాని గురించి చెప్పుకోవాలి. వాట్సాప్‌ డైరెక్టర్‌గా ఈ పేరు ఎప్పట్నుంచో చలామణీ అవుతోంది. వాస్తవానికి వాట్సాప్‌ సంస్థలో అలాంటి వారెవరూ లేరు. కంపెనీ వెబ్‌సైట్‌లో ఎక్కడా అలాంటి పేరు కనిపించలేదు. అంతేకాదు వాట్సాప్‌ పేరిట వచ్చే అధికారిక ప్రకటనల్లోనూ ఈ పేరు ఎప్పుడూ వచ్చిన దాఖలాల్లేవు.. ఇదిగో ఇలాంటి ఫేక్‌ సందేశాల్లో తప్ప! ఇక చెప్పుకోవాల్సింది తెలుగులో మాట్లాడుతున్న ఆ యువతి గురించి. ‘వాట్సాప్‌ను ఎవరో ఎవరికో అమ్మేస్తున్నారంట’.. ఆమె చెప్పిన మాటల్ని బట్టి ఆమె విషయ పరిజ్ఞానం ఏమిటో అర్థమవుతుంది. ఇంతకంటే ఎక్కువ ఈ సందేశాలు గురించి మాట్లాడుకోవడం వృథా ప్రయాసే అవుతుంది.  కాబట్టి మీకు వచ్చిన ఇలాంటి సందేశాలు పంపి సమయాన్ని వృథా చేసుకోకండి. మీతో పాటు మీ తోటి వారిని సైబర్‌ నేరగాళ్లకు బలి చేయకండి. ఇలాంటి విషయాల్లో ఆయా కంపెనీలు విడుదల చేసే అధికారిక సమాచారాన్నే నమ్మండి.

వాట్సాప్‌పై యువతి చెబుతున్న మాటలు ఇవే...

ఇవీ చదవండి..

ఫొటోలపై వాటర్‌మార్క్‌.. వేసుకోండిలా..! 

వాట్సాప్‌ నిర్ణయంతో.. ఆ యాప్‌లకు భారీ డౌన్‌లోడ్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని