WhatsApp: చడీచప్పుడు లేకుండా గ్రూప్‌ నుంచి వెళ్లినా తెలుసుకోవచ్చు!

గ్రూప్‌ యూజర్ల కోసం వాట్సాప్‌ పాస్ట్‌ పార్టిసిపెంట్స్‌ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా గడిచిన 60 రోజుల్లో గ్రూప్‌ సంభాషణల్లో పాల్గొన్నవారిలో ఎవరు గ్రూప్‌ నుంచి వెళ్లిపోయారనేది తెలుస్తుంది...

Published : 24 Jul 2022 18:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ (WhatsApp) గ్రూప్‌ యూజర్ల కోసం రెండు కొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది.  గ్రూపులో 512 మంది సభ్యులుగా ఉండేందుకు వీలుగా గ్రూప్‌ సైజులను పెంచనుంది. దానితోపాటు గ్రూప్‌లో సభ్యులుగా ఉండటం ఇష్టంలేని యూజర్‌ బయటి వెళ్లినా గ్రూప్‌లోని వారికి తెలియకుండా ఉండేందుకు లీవ్‌ వాట్సాప్‌ గ్రూప్స్‌ సైలెంట్లీ (Leave WhatsApp Group Silently) అనే ఫీచర్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ రెండు ఫీచర్లు పరీక్షల దశలో ఉన్నాయి. త్వరలోనే వీటిని యూజర్లకు పరిచయం చేయనుంది. 

ఇవేకాకుండా గ్రూప్‌ యూజర్ల కోసం వాట్సాప్‌ పాస్ట్‌ పార్టిసిపెంట్స్‌ (Past Participants) పేరుతో మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా గడిచిన 60 రోజుల్లో గ్రూప్‌ సంభాషణల్లో పాల్గొన్నవారిలో ఎవరు గ్రూప్‌ నుంచి వెళ్లిపోయారనేది తెలుస్తుంది. లీవ్‌ వాట్సాప్‌ గ్రూప్స్‌ సైలెంట్లీ ఫీచర్‌కు అనుబంధంగా పాస్ట్‌ పార్టిసిపెంట్స్‌ను తీసుకొస్తున్నారు. గడిచిన 60 రోజుల్లో జరిగిన సంభాషణల్లో ఎవరైనా యూజర్‌ పేరు లేకుంటే వారు గ్రూప్‌ నుంచి వెళ్లిపోయినట్లే. గ్రూప్‌ ఇన్ఫోపై క్లిక్ చేస్తే పాస్ట్‌ పార్టిసిపెంట్స్‌ ఫీచర్‌ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఐఓఎస్‌ 22.16.0.70 బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. 

యూజర్‌ ప్రైవసీ కోసం లీవ్‌ వాట్సాప్‌ గ్రూప్ సైలెంట్లీ ఫీచర్‌ను తీసుకొస్తున్నప్పటకీ.. పాస్ట్‌ పార్టిసిపెంట్స్‌ ఫీచర్‌తో గ్రూప్‌ నుంచి ఎవరు వెళ్లిపోయారనేది తెలుసుకోవచ్చు. ప్రస్తుతం గ్రూప్‌ నుంచి ఎవరైనా వెళిపోతే ఫలానా వ్యక్తి అని మిగిలిన సభ్యులకు తెలుస్తుంది. యూజర్‌ గోప్యత ప్రమాణాల్లో భాగంగా వాట్సాప్‌ ఈ ఫీచర్లను తీసుకొచ్చింది. ఇవేకాకుండా వాయిస్‌ మెసేజ్‌లను స్టేటస్‌గా పెట్టుకోవడం, డిలీట్ ఫర్‌ ఎవ్రీవన్‌ ఫీచర్ టైమ్‌ లిమిట్‌ను రెండు రోజుల 12 గంటల పెంచుతూ కొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని