రాష్ట్రావతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

రాష్ట్ర అవతరణ వేడుకలను హైదరాబాద్‌ నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Published : 29 May 2022 05:16 IST

సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ వేడుకలను హైదరాబాద్‌ నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శనివారం ఆయన పబ్లిక్‌గార్డెన్స్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జూన్‌ 2న ఉదయం తొలుత అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి, అక్కడి నుంచి పబ్లిక్‌ గార్డెన్స్‌కు చేరుకొని జాతీయ పతాకావిష్కరణ చేస్తారన్నారు. పోలీసుదళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన తర్వాత సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. అదేరోజు సాయంత్రం రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో 30 మంది ప్రముఖ కవులతో కవిసమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఎస్‌ వెంట డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ శర్మన్‌ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని