‘చిల్లీ హబ్’గా ఖమ్మం మార్కెట్ అభివృద్ధి
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుందని, దీన్ని ‘చిల్లీస్ హబ్’గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు.
మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుందని, దీన్ని ‘చిల్లీస్ హబ్’గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. సోమవారం ఇక్కడి మిరప యార్డులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరుకు చెందిన రైతు అచ్చ శ్రీను పక్షాన మంత్రి జెండా పట్టుకొని పాటలో పాల్గొన్నారు. (ఈ యార్డులో ప్రతిరోజు నాణ్యమైన సరకుకు తొలుత జెండా పాట నిర్వహించి, గరిష్ఠ ధరను నిర్ణయిస్తారు. మిగతా సరకును ఈ ధర ఆధారంగా కొనుగోలు చేస్తారు) మంత్రి స్వయంగా జెండా పాటలో పాల్గొనడంతో వ్యాపారులు పోటీపడ్డారు. దీంతో ఈ రైతుకు చెందిన తేజ మిరప క్వింటాకు రూ.25,550 పలికింది. తేజ రకానికి సంబంధించి మార్కెట్ చరిత్రలో ఇదే గరిష్ఠ ధర అని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చైనా వ్యాపారులు ఖమ్మంలో కంపెనీలు ఏర్పాటు చేసి నాణ్యమైన మిరపను ఆ దేశానికి ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. మన మిరప లేకుంటే చైనాలో మిర్చి, కారం లేవన్నారు. ఏటా ఆ దేశానికి ఇక్కడి నుంచి లక్షల క్వింటాళ్ల మిరప ఎగుమతి అవుతోందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2023)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం