ఆచార్య బాలశ్రీనివాసమూర్తి హఠాన్మరణం

తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ఆచార్యులు గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి(58) సోమవారం హఠాన్మరణం చెందారు.

Published : 25 Apr 2023 04:29 IST

తెవివి క్యాంపస్‌, న్యూస్‌టుడే: తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ఆచార్యులు గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి(58) సోమవారం హఠాన్మరణం చెందారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉదయం గుండెపోటుతో మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బాలశ్రీనివాసమూర్తి ప్రసిద్ధ అవధానులు గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ కుమారుడు. సాహితీవేత్తగా, పరిశోధకునిగా ఖ్యాతి గడించిన ఆయన యూనివర్సిటీ ఏర్పడిన తొలినాళ్ల నుంచి బోధన విధుల్లో ఉన్నారు. వర్సిటీలో వివిధ పరిపాలన పదవులు నిర్వహించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ రూపొందించిన ‘సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర’ పుస్తక సంపాదక బృందంలో సభ్యునిగానూ ఉన్నారు.  వీసీ ఆచార్య రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య యాదగిరి, బోధన, బోధనేతర ఉద్యోగులు ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ‘సహాచార్యులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాలశ్రీనివాసమూర్తి ఇటీవల ఆచార్యునిగా పదోన్నతి పొందారు. ఆ పదోన్నతిని రద్దు చేసినట్టు పాలకమండలి సభ్యులు ప్రకటించడంతో తీవ్ర మనస్తాపానికి గురై హఠాన్మరణానికి గురయ్యారు’అని వీసీ రవీందర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మరణం తెలుగు భాషకు తీరని లోటన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని