Medaram: ఫిబ్రవరి 21 నుంచి మేడారం మహాజాతర

సబ్బండ వర్గాలు కొంగు బంగారంగా కొలిచే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి.

Updated : 04 May 2023 07:03 IST

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, తాడ్వాయి, న్యూస్‌టుడే: సబ్బండ వర్గాలు కొంగు బంగారంగా కొలిచే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. 2024 ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో మహాజాతర నిర్వహించాలని పూజారులు నిర్ణయించారు. బుధవారం ములుగు జిల్లా మేడారంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకుని జాతర తేదీలను ఖరారు చేశారు. రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి సమీప బుధ, గురు, శుక్ర, శనివారాల్లో జాతరను నిర్వహించడం ఆనవాయితీ. తెలుగు రాష్ట్రాలతోపాటు, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. జాతరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించాలని పూజారుల సంఘం నాయకులు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని