నగదు కట్టడితో భూ కబ్జాలకు అడ్డుకట్ట

నగరంలో భూ ఆక్రమణదారులపై దృష్టిపెట్టిన వరంగల్‌ పోలీసు కమిషనర్‌ రంగనాథ్‌ ఇటీవల కాలంలో కబ్జాలకు పాల్పడ్డ ముగ్గురు కార్పొరేటర్లతో పాటు సుమారు 200 మందిని అరెస్టు చేశారు.

Published : 07 Jun 2023 04:38 IST

రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ ఐజీకి వరంగల్‌ సీపీ లేఖ

ఈనాడు, వరంగల్‌: నగరంలో భూ ఆక్రమణదారులపై దృష్టిపెట్టిన వరంగల్‌ పోలీసు కమిషనర్‌ రంగనాథ్‌ ఇటీవల కాలంలో కబ్జాలకు పాల్పడ్డ ముగ్గురు కార్పొరేటర్లతో పాటు సుమారు 200 మందిని అరెస్టు చేశారు.  కబ్జాలకు మూలం పెద్దఎత్తున నగదు చేతులు మారడమేనని పోలీసులు గుర్తించారు. దశాబ్దాల క్రితం స్థలాలు కొన్నామంటూ చోటామోటా నేతలు రంగంలోకి దిగి ప్రస్తుత యజమానులను బెదిరిస్తున్నారు. లావాదేవీలు జరగకున్నా నగదు ఇచ్చిపుచ్చుకున్నట్టు పత్రాలు రాసుకుంటున్నారు. ఈ తతంగాన్ని అడ్డుకోవాలంటే ప్రత్యక్ష నగదు చలామణిని భూ క్రయవిక్రయాల్లో పరిమితికి మించి అనుమతించవద్దని రాష్ట్ర రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ ఐజీకి సీపీ రంగనాథ్‌ లేఖ రాశారు. ఆదాయపు పన్నుశాఖ నిబంధనల ప్రకారం క్రయవిక్రయాల్లో కొంత మేరకే నగదు చెల్లింపులు ఉండాలని.. మిగతాది డిజిటల్‌, చెక్కుల ద్వారా జరగాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని