ఉత్తమ ఉపాధ్యాయులుగా 54 మంది ఎంపిక

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తున్న 54 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ.. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన వారి పేర్లు, వివరాలను ప్రకటించారు.

Updated : 03 Sep 2023 06:37 IST

ప్రకటించిన విద్యాశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తున్న 54 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ.. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన వారి పేర్లు, వివరాలను ప్రకటించారు. వారంతా ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ సంచాలకుల కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించారు. ఎంపికైన వారిలో 10 మంది గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు(జీహెచ్‌ఎం), 20 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, పీజీ టీచర్లు, 11 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, 12 మంది స్పెషల్‌ గ్రేడ్‌ విభాగం వారు, ఒకరు లెక్చరర్‌ ఉన్నారు. వీరితోపాటు నలుగురు పాలిటెక్నిక్‌ అధ్యాపకులు కూడా పురస్కారాలకు ఎంపికయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన వారితో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశమై సమీక్ష నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని