Adilabad: పచ్చని పెళ్లి పిలుపు.. పత్రికలో తులసి, బంతి, చామంతి విత్తనాలు

వివాహ ఆహ్వాన పత్రికలను కొందరు ప్రత్యేక అభిరుచితో తయారు చేయిస్తుంటారు. ఆదిలాబాద్‌కు చెందిన ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్‌ కోరకొప్పుల స్వర్ణలత తన కుమార్తె వైష్ణవి వివాహం నేపథ్యంలో బంధుమిత్రులకు పంచేందుకు కోయంబత్తూర్‌కు వెళ్లి 1,250 పత్రికలు, 500 పెన్నులు ఆర్డర్‌ ఇచ్చారు.

Published : 13 Mar 2024 06:05 IST

వివాహ ఆహ్వాన పత్రికలను కొందరు ప్రత్యేక అభిరుచితో తయారు చేయిస్తుంటారు. ఆదిలాబాద్‌కు చెందిన ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్‌ కోరకొప్పుల స్వర్ణలత తన కుమార్తె వైష్ణవి వివాహం నేపథ్యంలో బంధుమిత్రులకు పంచేందుకు కోయంబత్తూర్‌కు వెళ్లి 1,250 పత్రికలు, 500 పెన్నులు ఆర్డర్‌ ఇచ్చారు. వీటి ప్రత్యేకత ఏమిటంటారా.. పత్రికలో తులసి, బంతి, చామంతి విత్తనాలు.. పెన్నులో వంకాయ, టమాటా, కొత్తిమీర, పాలకూర, ముల్లంగి వంటి కూరగాయల విత్తనాలు ఉంటాయి. పత్రికను రెండు గంటలు నీటిలో నానబెట్టిన తరువాత మట్టిలో పాతిపెడితే మొలకలొస్తాయి. తన కుమార్తె పెళ్లిపత్రిక ద్వారా కొత్త మొక్కలకు జీవం పోయాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేయించానంటారు స్వర్ణలత.

ఈనాడు, ఆదిలాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని