కన్హా శాంతివనంలో బాబూజీ మహరాజ్‌ 125వ జయంతి వేడుకలు

రామచంద్ర మిషన్‌ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు బాబూజీ మహరాజ్‌ 125వ జయంతి వేడుకలు సోమవారం హైదరాబాద్‌ సమీపంలోని ప్రపంచ ఆధ్యాత్మిక శాంతి కేంద్రం కన్హా శాంతివనంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

Published : 30 Apr 2024 04:10 IST

ప్రారంభించిన మాజీ రాష్ట్రపతి కోవింద్‌, విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈనాడు, హైదరాబాద్‌- నందిగామ, న్యూస్‌టుడే: రామచంద్ర మిషన్‌ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు బాబూజీ మహరాజ్‌ 125వ జయంతి వేడుకలు సోమవారం హైదరాబాద్‌ సమీపంలోని ప్రపంచ ఆధ్యాత్మిక శాంతి కేంద్రం కన్హా శాంతివనంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, గౌరవ అతిథిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎనిమిది రోజుల పాటు నిర్వహించనున్న సమ్మేళనాన్ని (భండారా) వీరు ప్రారంభించారు. ఈ వేడుకలకు హాజరైన 50 వేల మంది భక్తులు.. అభ్యాసకులతో కలిసి సామూహిక ధ్యానంలో పాల్గొన్నారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ మాట్లాడుతూ.. బాబూజీ మనల్ని కరుణ, జ్ఞానంతో నడిపిస్తున్నారని అన్నారు. జీవిత లక్ష్యాలను చేరుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తూ హృదయపూర్వకంగా సవాళ్లను ఆహ్వానిద్దామని పేర్కొన్నారు. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మాట్లాడుతూ.. బాబూజీ మహరాజ్‌లోని మానవత, కరుణ, సమదృష్టి వంటి గుణాలను మనమంతా అలవర్చుకుందామన్నారు. రామచంద్ర మిషన్‌ ప్రారంభ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్తున్న అధ్యక్షులు దాజీ కమలేశ్‌ జీ పటేల్‌ అభినందనీయులని అన్నారు. కమలేశ్‌ మాట్లాడుతూ గురువును నిరంతరం స్మరించుకోవడం.. సరైనమార్గంలో నడిచేందుకు దోహదం చేస్తుందన్నారు. ఈ వేడుకల్లో గ్రామీ అవార్డు విజేతలు గణేశ్‌-కుమరేశ్‌ సంగీత విభావరి, ప్రత్యేక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. వివిధ భాషల్లో ప్రచురించిన ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు