రాజకీయ వేడి నడుమ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రశాంతత

‘ఓ వైపు మండుతున్న ఎండలు.. మరో వైపు రాజకీయ వేడి.. ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వారికి సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను, సాంత్వన చేకూరుస్తాయి’ అని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Published : 30 Apr 2024 04:12 IST

శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి
సందడిగా ‘ఉగాది కామధేను’ పురస్కారాల ప్రదానం

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: ‘ఓ వైపు మండుతున్న ఎండలు.. మరో వైపు రాజకీయ వేడి.. ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వారికి సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను, సాంత్వన చేకూరుస్తాయి’ అని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ ఇంటర్నేషనల్‌, వంశీ కల్చరల్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, రేలంగి ఆర్ట్‌ అకాడమీ, వేగేశ్న ఫౌండేషన్‌, ఘంటసాల ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన వంద మందికి ‘వంశీ-తిరుమల బ్యాంక్‌ ఉగాది కామధేను’ పురస్కారాలు అందజేశాయి. ఈ సందర్భంగా తిరుమల బ్యాంక్‌, వంశీ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్‌ నంగునూరి చంద్రశేఖర్‌ అధ్యక్షతన జరిగిన సభలో భగవాన్‌ విశ్వయోగి విశ్వంజీ మహరాజ్‌ అనుగ్రహభాషణ చేస్తూ.. మేధాశక్తిని సమాజ వినాశనానికి కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలన్నారు. ద్విసహస్రావధాని డా.మాడుగుల నాగఫణిశర్మ, సినీ నటుడు, నిర్మాత, ఎం.మురళీమోహన్‌, నటులు కోట శ్రీనివాసరావు, సుమన్‌, అలనాటి నటి రోజారమణి, దర్శకుడు రేలంగి నరసింహారావు, కళ పత్రిక సంపాదకుడు మహ్మద్‌ రఫీలతో పాటు మరికొందరు పురస్కారాలు అందుకున్నారు. వంశీ సంస్థల వ్యవస్థాపకుడు డా.వంశీ రామరాజు, రాధిక మంగిపూడి, డా.తెన్నేటి సుధాదేవి, శైలజ సుంకరపల్లి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు