సంక్షిప్త వార్తలు (8)

నీటిపారుదలశాఖలో మంగళవారం పది మంది ఇంజినీర్లు పదవీ విరమణ పొందారు. మంచిర్యాల చీఫ్‌ ఇంజినీర్‌ గడ్డం శ్రీనివాస్‌ ఈ జాబితాలో ఉన్నారు.

Updated : 01 May 2024 05:03 IST

పది మంది ఇంజినీర్ల పదవీ విరమణ

ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదలశాఖలో మంగళవారం పది మంది ఇంజినీర్లు పదవీ విరమణ పొందారు. మంచిర్యాల చీఫ్‌ ఇంజినీర్‌ గడ్డం శ్రీనివాస్‌ ఈ జాబితాలో ఉన్నారు. అలాగే ఎస్‌ఈలు సి.శ్రీనివాస్‌, శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎన్‌.రమేశ్‌, కె.ఎన్‌.ఆనంద్‌, సుశీల్‌కుమార్‌ దేశ్‌పాండే, ఈఈలు ఎ.సూర్యనారాయణరెడ్డి, ఎం.శ్రీనివాసరావు, ఎ.ఉదయ్‌కుమార్‌, బి.సంజీవరావులు పదవీ విరమణ పొందగా తోటి అధికారులు, సిబ్బంది వారి సేవలను గుర్తు చేసుకున్నారు.    


మెరిసిన నారాయణ విద్యార్థులు

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో నారాయణ స్కూల్స్‌ విద్యార్థులు.. ప్రతి ఏడుగురిలో ఒకరు, మొత్తం 12.5 శాతం మంది పది జీపీఏ సాధించినట్లు విద్యాసంస్థల ఎండీలు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. 1707 మంది విద్యార్థులు 9.5 జీపీఏ, ఆ పైన సాధించినట్లు వెల్లడించారు. అన్ని సబ్జెక్టుల్లో 32,135 మంది విద్యార్థులు ఏ గ్రేడ్‌ పాయింట్లు (91-100 మార్కులు) పొందారని పేర్కొన్నారు. ఓవరాల్‌ పాస్‌ పర్సంటేజ్‌ 99.3 శాతంగా ఉందన్నారు. నారాయణలో చదివిన ప్రతి విద్యార్థి సగటున 9.1 జీపీఏ సాధించినట్లు వెల్లడించారు.


సత్తా చాటిన శ్రీచైతన్య

పదో తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్స్‌ విద్యార్థులు 1402 మంది పది జీపీఏ సాధించారని డైరెక్టర్‌ సీమ తెలిపారు. బోర్డు ప్రకటించిన ఫలితాల్లో 10 జీపీఏ సాధించిన మొత్తం విద్యార్థుల్లో 16% శ్రీ చైతన్య స్కూల్‌ విద్యార్థులేనని వెల్లడించారు. 5,207 మంది విద్యార్థులు 9.5, ఆపైన జీపీఏ సాధించారని పేర్కొన్నారు. తమ విద్యార్థులు సగటున 9.2 జీపీఏ పొందారని, 99.2 శాతం మంది పాసయ్యారని వివరించారు. గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో 17,913 మంది విద్యార్థులు ఏ గ్రేడ్‌ సాధించారని చెప్పారు. విద్యార్థులను అభినందించారు.


భాష్యం విద్యార్థుల ప్రతిభ

పదో తరగతి ఫలితాల్లో భాష్యం విద్యార్థులు 264 మంది పది జీపీఏ సాధించారని హైదరాబాద్‌ భాష్యం జోనల్‌ హెడ్‌ అంకమ్మరావు తెలిపారు. 502 మంది 9.8, ఆ పైన జీపీఏ, 717 మంది 9.7, ఆ పైన జీపీఏ, 1492 మంది 9కిపైన జీపీఏ సాధించారని వెల్లడించారు. తమ విద్యార్థులు మొత్తం 11,201 ఏ గ్రేడ్‌లు సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు.


కేశవరెడ్డిలో ఉత్తమ ఫలితాలు

పదో తరగతి ఫలితాల్లో కేశవరెడ్డి విద్యాసంస్థల విద్యార్థులు అత్యధిక శాతం పది జీపీఏ సాధించారని ఫౌండర్‌ ఛైర్మన్‌ కేశవరెడ్డి తెలిపారు. పెద్దసంఖ్యలో విద్యార్థులు 9.8, 9.7, 9.5 జీపీఏలను సాధించినట్లు పేర్కొన్నారు. ప్రతి ఐదుగురిలో ఇద్దరు 9.0 జీపీఏ, ఆపైన సాధించారని వెల్లడించారు. అన్ని సబ్జెక్టులలో సగటు జీపీఏ 8కి పైగా ఉందని, సగటున 54 శాతం ఏ1, ఏ2 గ్రేడ్‌లు పొందినట్లు వివరించారు.


అల్ఫోర్స్‌ జయకేతనం

పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ విద్యార్థులు 135 మంది పది జీపీఏ సాధించారని విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. 139 మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 113 మంది విద్యార్థులు 9.7 జీపీఏ సాధించారని వెల్లడించారు. 1140 మంది విద్యార్థులకు గానూ 747 మంది విద్యార్థులు 9 జీపీఏ, ఆపై మార్కులు సాధించారన్నారు. విద్యార్థులను అభినందించారు.


ఎస్‌ఆర్‌ స్కూల్స్‌ మెరుపులు

పదో తరగతి ఫలితాల్లో ఎస్‌ఆర్‌ స్కూల్స్‌ విద్యార్థులు 124 మంది పది జీపీఏ సాధించారని విద్యాసంస్థల ఛైర్మన్‌ ఎ.వరదారెడ్డి తెలిపారు. విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని ఆచరణలోకి తెస్తూ ఒత్తిడి లేని వాతావరణంలో క్రమశిక్షణ, సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు.


గురుకుల విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రంలో బీసీ గురుకుల విద్యార్థులు పదోతరగతి ఫలితాల్లో 98.25 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారని గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. 153 గురుకులాల్లో నూరుశాతం ఉత్తీర్ణత నమోదైందని, 391 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారని పేర్కొన్నారు. 

  •  గిరిజన గురుకులాల్లో పదో తరగతిలో 97.3 శాతం ఉత్తీర్ణత నమోదైందని గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 89.64 శాతం, వసతి గృహాల్లో 90.85 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు.
  • ఎస్సీ గురుకుల సొసైటీలో పదిలో 98.06 శాతం ఉత్తీర్ణత వచ్చినట్లు సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. రాష్ట్రంలో 122 గురుకులాలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించాయని, 187 మంది విద్యార్థులు పది జీపీఏ తెచ్చుకున్నారని వివరించారు.
  • తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులు 89 మంది పది జీపీఏ సాధించారని విద్యాసంస్థ (టీఎస్‌ఆర్‌ఈఎస్‌) కార్యదర్శి రమణకుమార్‌ తెలిపారు. మిగిలిన గురుకులాల కంటే తమ సంస్థ విద్యార్థులు అత్యధిక ఫలితాలు సాధించారని వెల్లడించారు.

 ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని