ప్రాణాలు తీసిన పెద్దపులిని పట్టేశారు

మహారాష్ట్రలోని బల్లార్ష-కార్వా అటవీ ప్రాంతంలో నాలుగు నెలల కాలంలో నలుగురు వ్యక్తుల ప్రాణాలు తీసిన టి-86 అనే పెద్దపులిని ఎట్టకేలకు అటవీ అధికారులు సోమవారం రాత్రి పట్టుకుని చంద్రపూర్‌కు తరలించారు.

Published : 01 May 2024 02:55 IST

హారాష్ట్రలోని బల్లార్ష-కార్వా అటవీ ప్రాంతంలో నాలుగు నెలల కాలంలో నలుగురు వ్యక్తుల ప్రాణాలు తీసిన టి-86 అనే పెద్దపులిని ఎట్టకేలకు అటవీ అధికారులు సోమవారం రాత్రి పట్టుకుని చంద్రపూర్‌కు తరలించారు. అటవీ అధికారి నరేశ్‌ బావరే తెలిపిన వివరాల ప్రకారం.. అటవీ సమీప గ్రామాల్లోని ముగ్గురు పురుషులు, ఓ మహిళను, పశువులను పెద్దపులి హతమార్చిందన్నారు. పులిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలు, బోన్లు అమర్చి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం పులి కార్వా అడవిలో సంచరిస్తోందని గుర్తించి.. షూటర్‌ అవినాష్‌ ఫూల్‌జలేను రంగంలోకి దింపి మత్తు సూది ఇచ్చామన్నారు. అటవీశాఖ వైద్యాధికారి కుందన్‌ ఆధ్వర్యంలో పులిని బోనులో బంధించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నట్లు పేర్కొన్నారు. 

న్యూస్‌టుడే, బల్లార్ష

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని