Justin Trudeau: మేం విడిపోతున్నాం.. కెనడా ప్రధాని ట్రూడో దంపతుల ప్రకటన

తన భార్య సోఫీతో విడాకులు తీసుకొంటున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రకటించారు.

Updated : 02 Aug 2023 23:39 IST

ఒట్టావా: తన సతీమణి సోఫీ గ్రెగోయిర్‌తో విడిపోతున్నట్టు కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau) ప్రకటించారు. తమ వైవాహిక బంధానికి స్వస్తిపలుకుతూ ఆ దంపతులిద్దరూ అధికారిక ఇన్‌స్టా గ్రామ్‌ వేదికగా పోస్ట్‌లు పెట్టారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు చాలా అర్థవంతమైన, కష్టతరమైన చర్చలు జరిపినట్టు తెలిపారు. అయితే ఎప్పటిలాగే తమ మధ్య ఏర్పడిన లోతైన ప్రేమ, గౌరవం ఇక ముందు కూడా కొనసాగుతాయన్నారు. పిల్లల శ్రేయస్సును గౌరవిస్తూ వారి గోప్యతకు భంగం కలగకుండా చూడాలని పేర్కొన్నారు. ట్రూడో, సోఫీకి 2005లో వివాహం జరగ్గా.. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని